శ్రీకాకుళం

ఏనుగులను తరలించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 11: ఒడిషాలోని లకేరీ అడవుల నుంచి జిల్లాలో గజరాజులు ప్రవేశించి గిరజన జీవనానికి ఆటంకం కలిగిస్తూనే ఉన్నాయని విధ్వంసం కలిగిస్తున్న వీటిని ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిశాంతి తదితరులు గ్రీవెన్స్‌లో విన్నవించారు. టి పి ఎం యు పరిధిలో సీతంపేట, ఎల్ ఎన్ పేట, కొత్తూరు, భామిని , హిరమండలం, మెళియాపుట్టి మండలాల్లో ఏనుగుల కదలికలు భయాందోళనకు గురిచేస్తున్నాయన్నారు. కొండపై తిష్టవేసిన ఏనుగులు నీటి కోసం మైదాన ప్రాంతాలపై పరుగులు తీస్తున్నాయన్నారు. గిరిజనులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయన్నారు. గజరాజులు జనావాసాల్లోకి వస్తుంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని పేర్కొన్నారు. వీటిని తరలించే ప్రయత్నం చేయాలని ఆమె కోరారు. ఏనుగులు తరలించి గిరిజనులు ప్రాణభయానికి, జీవనోపాధికానికి హానికలుగకుండా చూడాలన్నారు.
వంశధార పర్యవేక్షన ఇంజనీర్‌గా శేషగిరిరావు

శ్రీకాకుళం, డిసెంబర్ 11: బి.ఆర్.ఆర్. వంశధార ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరుగా టి.వి.శేషగిరిరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శేషగిరిరావు గతంలో గుంటూరు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేసారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాకు బదిలీపై వచ్చారు. శ్రీకాకుళం ఇరిగేషనద్ సరికల్ పర్యవేక్షక ఇంజనీరుగా అదనపు బాధ్యతలతో పనిచేస్తారు. వంశధార ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యానికి పూర్తి కావడానికి కృషి చేస్తామని అన్నారు. అందరి సహకారంతో జిల్లాలో జలవనరుల ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తామని పేర్కొన్నారు.