శ్రీకాకుళం

అణుపార్కు పరిహారం అవకతవకలపై ప్రత్యక్షపోరుకు సమాయత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రణస్థలం, డిసెంబర్ 11: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కొవ్వాడలో తలపెట్టిన కొవ్వాడ అణువిద్యుత్ పార్కు ఆటంకాలు ఎదురుకానున్నాయి. ఇప్పటివరకు అణుపార్కు ఏర్పాటు సానుకూలంగా జరుగుతుందనుకున్నా పరిహారం పంపిణీలో అవకతవకలు జరిగినట్లు అనుమానాలు రావడంతో సంబంధిత రైతులు, మత్స్యకారులు ప్రత్యక్ష పోరుకు సమయత్తం అవుతున్నారు. అణుపార్కుకు సంబంధించి కొవ్వాడ, చినకొవ్వాడ, రామచంద్రాపురం, గూడెం, టెక్కలి గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉంది. అదే విధంగా దీని కోసం 2500 ఎకరాల భూమిని సేకరించారు. భూసేకరణ కోసం ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. తొలి విడతలో డీ పట్టా భూములకు పరిహారాన్ని అందజేయగా ఇప్పుడు జిరాయితీ భూములకు ఎకరాకు రూ.18లక్షలు నిర్ణయిస్తూ ఇటీవల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అయితే ఇప్పటివరకు మంజూరు చేసిన పరిహారంలో పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ప్రధానంగా డీ పట్టా భూముల వ్యవహారంలో రెవెన్యూ యంత్రాంగం కొంతమంది దళారులతో కుమ్మక్కై వ్యవహారం నడిపిస్తోంది. ఇప్పటికే పరిహారం పంపిణీలో అవకతవకలు జరిగాయని ఇద్దరు గ్రామ రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేసినా ఈ వ్యవహారంలో పైస్థాయి అధికారుల ప్రమేయంపై అనుమానాలు తెలుపుతున్నాయి. ప్రధానంగా భూముల నమోదులో రెవెన్యూ యంత్రాంగం ఇష్టానుసారంగా వ్యవహరించారని రైతులుమత్స్యకారులు అంటున్నారు. దీనిపై పలు దఫాలుగా రెవెన్యూ యంత్రాంగానికి దరఖాస్తులు పెట్టుకున్నా కనీసం పట్టించుకోవడం లేదని మత్స్యకారులు , రైతులు చెబుతున్నారు. లక్షకోట్ల రూపాయల ప్రాజెక్టు అంటే ఇక్కడ రెవెన్యూ సిబ్బందికి అలుసుగా ఉందని దీనిపై కనీసం సమీక్షలు కూడా చేయడం లేదని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం కొంతమంది మత్స్యకారులు ప్రజా సంఘాలతో గుట్టుచప్పుడుగా సమావేశం అవడం జరిగింది. త్వరలో వీరంతా ప్రత్యక్షపోరుకు సమాయత్తం కానున్నారు. రణస్థలం తహశీల్దార్ కార్యాలయంలో గాని, జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి గాని దీక్షలు ప్రారంభించి తమ నిరసనను తెలియజేయనున్నారు. అంతేకాకుండా తమకు అన్యాయం జరిగిందని ఇప్పటికే పలువురు రైతులు లాయర్ల చుట్టూ రెవెన్యూ యంత్రాంగం నోటీసులు ఇచ్చేందుకు తిరుగుతున్నారు.
* దృష్టి సారించని మంత్రి
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న లక్షకోట్ల రూపాయల ప్రాజెక్టుపై స్థానిక ఎమ్మెల్యేలు, ఇంధణ శాఖామంత్రి అయిన కిమిడి కళావెంకటరావు కనీసం దృష్టిసారించడం లేదని రైతులు అంటున్నారు. జిల్లాలో వంశధార పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రంలో కలెక్టర్, రవాణా మంత్రి అచ్చెన్నాయుడు సంబంధిత అధికారులు సమీక్షలు జరిపి ఎప్పటికప్పుడు అక్కడ సమస్యలు తెలుసుకుంటుంటే స్థానిక మంత్రి కళావెంకటరావు కనీసం ఇక్కడ సాధకబాధకాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని అన్ని వర్గాల వారు చెబుతున్నారు. అణుప్రాజెక్టులో తమకు అన్యాయం జరిగిందని ఎవరికీ చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని మత్స్యకారులు చెప్తున్నారు. ప్రధానంగా మంత్రి దృష్టి సారించకపోవడంతో రెవెన్యూ యంత్రాంగం కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని అందుకే కోర్టులను ఆశ్రయించక తప్పడం లేదని మత్స్యకారులు చెప్తున్నారు.