శ్రీకాకుళం

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, డిసెంబర్ 11: అన్ని రంగాల్లో మహిళలు రాణించేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృద్ధి సంక్షే మ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ స్పష్టంచేశారు. డ్వాక్రా సంఘాలు రూపకల్పన చేసిన చంద్రబాబు వారికి నెలకు రూ. 10వేలు ఒక్కొ కుటుంబానికి ఆదాయం వచ్చే కార్యక్రమాలను లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ నిరాటంకంగా కొనసాగిస్తున్నారన్నారు. మండల కాంప్లెక్స్ ఆవరణలో మహిళా సమాఖ్య భవనంలో డ్వాక్రా సంఘాలు ప్రతినిధులకు ప్రభు త్వం ఇస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం చైర్‌పర్సన్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ జిల్లాలో 45వేలు సంఘాలు ఉన్నాయని వీటిలో 5లక్షల మంది సభ్యులుగా నమోదయ్యారన్నారు. వీరందరికీ బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు, స్ర్తినిధి రుణాలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, పావలా వడ్డీ అంతర్గత అప్పులు, వంటి కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతీ సంఘ సభ్యురాలుకి రూ.10వేలు పసుపు-కుంకుమ ఇవ్వడం జరిగిందన్నారు. సంఘానికి ఒకరికి చొప్పున మండల పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రి ల్ వరకు ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగించేలా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేసిందన్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకునే కార్యక్రమాలపై అవగాహన పెంచుకొని ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బల్లాడ వెంకటరమణారెడ్డి, ఎంపిడివో మురళీమోహన్, ఏరి యా కో ఆర్డినేటర్ భూషణ్, ఏపి ఎం రత్నం, ఎంఎంఎస్ అధ్యక్షురాలు ఎస్.పద్మావతి, కుమారి, సి ఎఫ్‌లు, గ్రామ సమాఖ్య అధ్యక్షులు ఉన్నారు.

నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను
అందిపుచ్చుకోవాలి
ఎచ్చెర్ల, డిసెంబర్ 11: ప్రభుత్వం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి పలు శిక్షణా కార్యక్రమాలు విద్యార్ధులకు అందించడం జరుగుతుందని వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ వర్శిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కూన రామ్‌జీ తెలిపారు. సోమవారం క్యాంపస్ ఆవరణంలోని సెమినార్ హాల్‌లో ఏపి స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో ఇన్‌ఫోసిస్ కంపెనీ ప్రాంగణం ఎంపికలపై ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని విద్యార్ధులకు ఇంటర్య్వూలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీసి ప్రారంభించి మాట్లాడుతూ ప్రాంగణం ఎంపికలు విద్యార్ధులు చక్కటి అవకాశంగా మలుచుకోవాలన్నారు. నైపుణ్యాన్ని పెంపొందించుకొని ప్లేస్‌మెంట్స్ పొందాలని కోరారు. రిజిస్ట్రార్ జి.తులసీరావు మాట్లాడుతూ ఏపి స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ విద్యార్ధుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు అమలు చేస్తున్న అనేక అంశాలను వివరించారు. జిల్లా మేనేజర్ ఎన్.గోవిందరావు మాట్లాడుతూ ఇన్‌ఫోసిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రాంగణ ఎంపికల నిర్వహణకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
వౌకిక, ఆన్‌లైన్ పరీక్షలు ఎలా ఎదుర్కొంటే ఉద్యోగాలు పొందగలరన్న అంశాలపై అవగాహన కల్పించారు. నియోజకవర్గం పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన 140మంది అభ్యర్ధులు హాజరయ్యారు. నైపుణ్య శిక్షకులు మురళీ, ఏ పి ఎస్ డి సి సిబ్బంది పాల్గొన్నారు.