శ్రీకాకుళం

వర్శిటీ అభివృద్ధికి సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, డిసెంబర్ 12: జిల్లా అభివృద్ధిలో భాగమైన విశ్వవిద్యాలయం అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, అంబేద్కర్ వర్శిటీ విసి కూన రామ్‌జీ కోరారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వైస్‌చాన్సలర్ జిల్లాలో ప్రజా ప్రతినిధులను మర్యాద పూర్వకంగా కలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం జడ్పీ చైర్‌పర్సన్‌ను కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ విసిను ప్రత్యేకంగా అభినందించి విశ్వవిద్యాలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

గ్రామ కమిటీ సమావేశాలు నిర్వహించాలి
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 12: గ్రామ కమిటీ సమావేశాలు ప్రతి నెల 9వ తేదీన నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో టిడిపి జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, విజయనగరం జిల్లా పరిశీలకుడు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహణ కార్యదర్శి ఎల్.ఎల్ నాయుడు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పొందల కృష్ణారావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సాధు చిన్నికృష్ణం నాయుడు పాల్గొన్నారు. మండల కమిటీ సమావేశాలు 14న నియోజకవర్గ సమావేశం 18న, జిల్లా సమావేశం 22న తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. జిల్లా పార్టీ అధ్యక్షునికి బూత్ కమిటీలు పూర్తిచేసినందుకు అభినందించారు. కార్యకర్తల శిక్షణ నియోజకవర్గాల వారీగా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.

ప్రజల ముంగిటకు వర్శిటీ సేవలు
ఎచ్చెర్ల, డిసెంబర్ 12: విశ్వ విద్యాలయాల సేవలు ప్రజల ముంగిటకు తీసుకువెళ్లే దిశగా విధులు నిర్వహిస్తే ర్యాంకింగ్ సాధన జాతీయ స్థాయిలో సాధించడం మరింత సులువు అవుతుందని అంబేద్కర్ వర్శిటీ విసి కూన రామ్‌జీ స్పష్టం చేశారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ దేశంలో విశ్వవిద్యాలయాల పనితీరును ప్రమాణికంగా తీసుకుని ర్యాంకింగ్ ఇవ్వడం ఓ సంప్రదాయమన్నారు.
ర్యాంకింగ్ సాధనపై మంగళవారం ఆయన ఛాంబర్‌లో వర్శిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తరగతి గది నుంచి సామాన్యుల వరకు విశ్వవిద్యాలయాల ఫలాలు చేర్చే దిశగా అధ్యాపకులు, విద్యార్థులు పనిచేస్తే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. క్లాసు రూమ్‌టు కామన్ మ్యాన్ అనే ఫార్ములాతో ముందుకు సాగే కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలిగితే మంచి ర్యాంకు సాధన సులువు అవుతుందన్నారు. ఈ దిశగా ఇక్కడ అధికారులు ప్రణాళికబద్దంగా ర్యాంకింగ్ ప్రమాణాలను పాటించి ఉన్నత విద్యను మరింత నైపుణ్యంగా అందించగల్గాలన్నారు. పరిశోధనా అంశాలు, నూతన అవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ జి.తులసీరావు, ప్రిన్సిపాల్ పి.చిరంజీవులు, డీన్ టి.కామరాజు, చీఫ్ వార్డెన్ అడ్డయ్య, ఐక్యూ ఎసి కో ఆర్డినేటర్ పి.సుజాత, ఎయు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రోఫెసర్ అవధాని హాజరై ర్యాంకింగ్ సాధనపై పలు అంశాలు చర్చించారు.