శ్రీకాకుళం

ఉద్యోగులకు కొత్త సంవత్సర కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో 80 శాతం ప్రజలు అనుకూలంగా ఉండాలని, విశ్వసించాలన్న ఆత్రూతతో చేసే హామీలు కొన్ని నెరవేరగా, మరికొన్ని ఇంకా ప్రారంభించలేదు. ఇలా.. 2016, ఫిబ్రవరిలో ఎచ్చెర్లలో జరిగిన ఎన్జీవోల 19వ రాష్ట్ర మహాసభలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన శ్రీకాకుళం నగరంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం హెచ్.ఆర్.ఎ. హామీకి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం జి.వో.నెం.195 విడుదల చేసింది. రాష్టమ్రంతటా ఒకేవిధానంలో జిల్లా కేంద్రాల్లో హెచ్.ఆర్.ఎ. ఉండాలంటూ ఎన్జీవోల సంఘం రాష్ట్రం నుంచి జిల్లా వరకూ ప్రతినిధులంతా పోరాటం తీవ్రతను పరిశీలించిన ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 14.5 శాతం నుంచి 20 శాతం హెచ్.ఆర్.ఎ. పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1, 2018 నుంచి పెరిగిన హెచ్.ఆర్.ఎ. అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో జిల్లా కేంద్రంలో 6782 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెరిగిన హెచ్.ఆర్.ఎ. అమల్లోకి వస్తుంది. వారందరూ ఫిబ్రవరిలో అందుకునే జీతభత్యాల్లో ఈ పెరిగిన మొత్తం ప్రయోజనం పొందుతారు. ముఖ్యమంత్రి 2016లో ఇచ్చిన మాట ప్రకారం సిక్కోల్ ఉద్యోగులకు 20 శాతం హెచ్.ఆర్.ఎ. మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం పట్ల ఉద్యోగులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.