శ్రీకాకుళం

దివ్యాంగులకు చేయూతనిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 16: దివ్యాంగులకు చేయూతనివ్వాలని డాక్టర్ దానేటి శ్రీ్ధర్ అన్నారు. నగరంలో దివ్యాంగులకు మూడుచక్రాల సైకిళ్లను శ్రీకాకుళం సెంట్రల్ రోటరీ అధ్యక్షుడు నటుకుల మోహన్ ఆధ్వర్యంలో శనివారం దివ్యాంగులు బి.పోలినాయుడు, జగదీష్, చెంచమ్మలకు దానేటి శ్రీ్ధర్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి వంచకులుగా దివ్యాంగులకు చూస్తూ జాలి చూపడం కంటే వారి దయనందిన అవసరాలను తీర్చేందుకు అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నటుకుల మోహన్ ముందుకు రావడం ముదావహమన్నారు. దివ్యాంగులకు ఆసరా కల్పించి వారికి చేయూతనందించడం, ఆర్థికంగా స్థిరపడిన ప్రతీ ఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు. జీవితంలో ఎన్ని సాధించిన పరోపకారానికి మించిన తృప్తి ఉండదన్నారు. నటుకుల మోహన్ మాట్లాడుతూ రోటరీ సంస్థ ఉన్నతమైన ఆదర్శాలను పెంపొందించే గొప్పసంస్థ అని పేర్కొన్నారు. ప్రపంచంలో అనేక దేశాల్లో స్వచ్ఛంద సేవలతో పాటు యువతను చైతన్యవంతం చేసే కార్యక్రమాలను రోటరీ నిర్వహిస్తుందని తెలియజేశారు. సమాజంలో ప్రతీ ఒక్కరూ మరొకరికి సాయం చేసే గుణాన్ని పెంపొందించడమే రోటరీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటాక్ జిల్లా కన్వీనర్ రాధాప్రసాద్, రోటరీ సభ్యులు అప్పలనాయుడు, వైకుంఠరావు, అందవరపు రమేష్, వైశ్యరాజు మోహన్, నర్శునాయుడు తదితరులు పాల్గొన్నారు.

రాహుల్ ప్రమాణస్వీకారంతో ప్రజల్లో నూతన ఉత్సాహం
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 16: ఏ ఐ సి సి అధ్యక్షునిగా రాహుల్ గాంధీ ప్రమాణస్వీకారం చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజల్లోనూ నూతన ఉత్సాహం పుడుతుందని మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ అన్నారు. రాహుల్ గాంధీ ఏ ఐ సి సి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా శనివారం నగరంలోని ఏడురోడ్ల కూడలిలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ చౌదరి సతీస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మిఠాయిలను పంపిణీ చేసి బాణా సంచా పేల్చి హర్షాతిరేఖాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు డోల జగన్ మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో రాహుల్ ఉన్నారని బిజెపి ప్రభుత్వం ప్రజల ఆహారపు అలవాట్లపై పేదవాడి పట్ల దాడి చేస్తుందన్నారు. బిజెపి మతతత్వ పార్టీగా మారిందన్నారు. సుఖసంతోషాలతో ఉండాలంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావాలని తెలియజేశారు. దేశమంతటా సంబరాలు జరుపుకొంటున్నారని అందులో భాగంగానే ఈ సంబరాలు జరుపుకొంటున్నట్లు తెలియజేశారు. 2019 నాటికల్లారాహుల్ ప్రధాని అయ్యేందుకు తామంతా కృషి చేస్తున్నామన్నారు. నియోజకవర్గ ఇంఛార్జ్ చౌదరి సతీస్ మాట్లాడుతూ రాహుల్ ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో సంతోషంగా ఉందని పార్టీనేతలు మరింత ఉత్సాహంతో ముందుకు వస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, ముస్తాక్ మహ్మద్, రత్నాల నర్శింహమూర్తి, బాణ్న రాము, సనపల అన్నాజీరావు, పైడి రవి, మామిడి రాంబాబు, కె.రాజ్యలక్ష్మీ, సనపల అన్నాజీరావు, గోవిందమల్లిబాబు, అల్లిబిల్లి రాధ, సిహెచ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.