శ్రీకాకుళం

జిల్లాలో రబీకి ప్రధమంగా నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 16: జిల్లాలో డిసెంబర్ 16వ తేదీ చరిత్రలో నిలిచిపోయేరోజు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రబీకి నీటి విడుదల చేసిన రోజు. సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు 100సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ మడ్డువలస రిజర్వాయర్ 15 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నప్పటికీ రబీకి నీటిని విడుదల చేసిన సంఘటన చోటు చేసుకోలేదు. అయితే ఈ ఏడాది ముందస్తు ప్రణాళికతో జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి ప్రణాళికలు, జిల్లా మంత్రుల సహకారంతో నూతన ఘట్టానికి శ్రీకారం చుట్టారు. రబీ పంటకు మడ్డువలస జలాశయం వద్ద జిల్లా కలెక్టర్ పూజలు నిర్వహించి సంప్రదాయ బద్ధంగా నీటిని విడుదల చేశారు. ప్రతీ నీటి బొట్టు సద్వినియోగం కావాలని ఆయన ఆకాంక్షించారు. నీటి విడుదల కార్యక్రమాన్ని రిజర్వాయర్ వద్ద కలెక్టర్ ప్రారంభించగా తోటపల్లి వద్ద జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీరు శేషగిరిరావు నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 16 జిల్లాకు ఎంతో శుభదినమని అభినందించారు. జిల్లాలో వాటర్ బడ్జెటింగ్ చేయని కారణంగా రైతుల్లో సరైన అవగాహన లేనికారణంగా ఇనే్నళ్లు రబీకి నీటి విడుదలకు ప్రణాళికలు రూపొందించలేదన్నారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటినిల్వలు ఉన్నాయన్నారు. రబీ పంటకు మడ్డువలస రిజర్వాయర్ నుండి ప్రతీ ఏడాది 30 నుండి 35వేల ఎకరాలకు నీటిని విడుదల చేసే సామర్ధ్యం ఉందని అయినప్పటికీ నిరుపయోగంగా ఉండటం గమనించామని చెప్పారు. దీనిలో రెండవ పంట రావాలని యోచించి అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు. రెండవ పంట వేయడం వలన రైతుకు పంట రావడంతోపాటు భూసారం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రబీకి జూన్ నుండి రైతులను సమాయత్తం చేశామని ఆయన వివరించారు. ఆరుతడి పంటలను మాత్రమే వేయాలని సూచించారు. వరిపంటకు నీటిని విడుదల చేయడం లేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా రబీలో వేసే ఆరుతడి పంటలైన మొక్కజొన్న, వేరుశనగ, రాగి, మినుము, పెసలు, ఉలవలు, మిరప, చెరకు వంటి పంటలకు 50శాతం రాయితీతో రూ.7కోట్లు విలువచేసే విత్తనాలను ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాకు మంజూరు చేయడం మరో విశేషమన్నారు. జిల్లాలో రూ.30కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను రైతులకు సమకూర్చుతున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 25 వేల హెక్టార్లలో మొక్కజొన్న వేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారని తద్వారా రూ.300కోట్ల మేర ఆదాయం జిల్లాలో రాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పశుగ్రాసం పెంచినప్పటికీ మంచి ఆదాయం వస్తుందని కలెక్టర్ అన్నారు. జలవనరుల శాఖ ఇంజినీర్లు, వ్యవసాయ అధికారులతోపాటు రైతులకు అవగాహన కల్పిస్తూ వచ్చామని తెలిపారు. రబీలో వ్యవసాయ భూమి ఖాళీగా కనిపించరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. వంశదార- ఆఫ్‌షోర్ వంటి ప్రాజెక్టులు పూర్తికావడం వలన జిల్లాలో 2లేదా 3 పంటలు వేసే అవకాశం ఉంటుందని రైతులు ఆ దిశగా సిద్ధం కావాలన్నారు. 2018 సంవత్సరం రబీలో 2.50లక్షల ఎకరాల నుండి రూ.5లక్షల ఎకరాల వరకు పంటను విస్తరించాలని యోచిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రబీలోజిల్లాలో ఇప్పటికే 94వేల హెక్టార్లలో పంటలు వేయగా అందులో మొక్కజొన్న 25వేల హెక్టార్ల లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటికే 13,529 హెక్టార్లలో వేయడం జరిగిందని తెలిపారు. రాగి పంటలను 5,250 హెక్టార్లకు 2,660 హెక్టార్లలో వేశారని, పెసలు 40 వేల హెక్టార్లకు 29,436 హెక్టార్లు, మినప 55వేల హెక్టార్లకు 40,716 హెక్టార్లు, ఉలవలు 4,045 హెక్టార్లకు 2024 హెక్టార్లలో వేరుశనగ 8వేలకు గాను 3,054 హెక్టార్లలో కంది 9వేలకు 25హెక్టార్లలో పంటలు వేయడం జరిగిందని ఆయన తెలిపారు. మడ్డువలస రిజర్వాయర్ నుండి అధికారికంగా 24,775 ఎకరాలకు తోటపల్లి పాత రెగ్యులేటర్ నుండి 56,812 ఎకరాలకు నీరు విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీరు శేషగిరిరావు తెలిపారు. మడ్డువలస కుడి కాలువ నుండి సంతకవిటి మండలంలో 38 గ్రామాలకు, రేగిడి ఆమదాలవలసలో 32 గ్రామాలకు, జి.సిగడాంలో 14 గ్రామాలకు వెరసి 84 గ్రామాలకు నీరు అందుతుండగా ఎడమకాలువ నుండి వంగర మండలంలో 5 గ్రామాలకు నీరు అందుతుందని ఆయన చెప్పారు. తోటపల్లి ఎడమ ఛానెల్ ద్వారా వీరఘట్టంలోని 33 గ్రామాలకు, పాలకొండలోని 36 గ్రామాలకు, బూర్జలోని 3 గ్రామాలకు నీరు అందిస్తుండగా కుడి ఛానెల్ ద్వారా వంగర మండలంలో 19 గ్రామాలకు వెరసి 91 గ్రామాలకు నీరు అందుతుందని తెలిపారు. మడ్డువలస, తోటపల్లి ప్రాజెక్టుల నుండి మొత్తంగా 180 గ్రామాలకు నీరు అందుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మడ్డువలస ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీరు డి ఎస్ ప్రదీప్, డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు ఎన్.గణేష్, ఎస్.శ్యామ్‌సుందర్, వ్యవసాయ శాఖ జెడి రామారావు, జలవనరుల శాఖ సలహాదారు ఎంవి రమణమూర్తి, వంగర ఎంపిపి ఎలకల అమ్మడమ్మ, జలవనరుల, వ్యవసాయ శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

దర్జాగా కబ్జాలు
* ఆక్రమణలపై అధికారుల నిఘా కరువు
జలుమూరు, డిసెంబర్ 16: మండలం పలు గ్రామాల్లో విలువైన పోరంబోకు ప్రభుత్వ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు బాహాటంగా చెప్తున్నారు. ఇళ్ల స్థలాలకు లక్షల్లో ధరలు పెరగడంతో చెరువులు, ప్రధాన రహదారుల ఇరువైపులా ఆక్రమణలు చేయడానికి వెనుకాడటం లేదు. ఎటువంటి అనుమతులు లేని ఈ భవనాలను క్రమవిక్రయాలు జరుపుకొంటున్నారు. చల్లవానిపేట జంక్షన్ లింగాలవలస పంచాయతీ, పలు ప్రాంతాల చెరువులు ఇప్పటికే గట్లు కనిపించకుండా పోయింది. చెరువు గర్భాలు తప్ప చెరువు కనిపించడం లేదు. చిన్న దూగాం జంక్షన్ నుండి తిలారుకు వెళ్లే కిలోమీటర్ పొడవున ఆనుకొని పక్కా భవనాలు, అంతస్తులు నిర్మించారు. దీని వలన నిరంతర వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఇంత భారీగా కబ్జాలు జరుగుతుంటే అధికారులు కనీసం ఆక్రమణ దారులకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవడం అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. తహశీల్దార్‌కు వివరణ కోరగా గతంలో ఆక్రమణదారులకు నోటీసులు అందజేశామని తమ దృష్టికి రాగానే చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.