శ్రీకాకుళం

అమెరికా గెడ్డపై ఉద్దాన ఆడపడుచు ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిటి, డిసెంబర్ 17: విదేశాల్లో మరో ఉద్దాన ఆడపడుచు ఉన్నత చదువులతో రాణించి ఏకంగా గోల్డ్ మెడల్ సాధించి జిల్లా కీర్తిని ఇనుమడింపజేసింది. మండలంలోని బొరివంక గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు, గెస్ట్ సేవా సంఘం అధ్యక్షుడు శంకరరావు కుమార్తె శ్రావ్య అమెరికా యూనివర్శిటీలో గోల్డ్ మెడల్ సాధించింది. యు ఎస్ ఎలోని యూనివర్శిటీ గాడ్యుయేట్ అకాడమీలో మాస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమ్మెస్సీ, ( 4జిపి ఎస్) సాధించడంలో యు ఎస్ ఎలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రావ్య తల్లిదండ్రుల సమక్షంలో మెడల్ అందుకుంది. మొత్తం 59 మంది విద్యార్థులో ఈమెకు ఎల్లోబెల్ట్ సాధించింది. యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ డౌన్‌కాన్‌సెస్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకుందని తండ్రి శంకరరావు తెలిపారు.
సోషల్ మీడియాపై నేతలకు శిక్షణ
ఇచ్ఛాపురం, డిసెంబర్ 17 : ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన టిడిపి యువనేతలు సోషల్ మీడియా వినియోగంపై ఆదివారం శిక్షణ పొందారు. విజయనగరం జిల్లాలోని పాత దుప్పాడ వద్ద గల టిడిపి ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన శిబిరానికి తనతోపాటు ఢిల్లీరావు (ముచ్చింద్ర), శ్రీనివాస్ (కవిటి), జి.మధు (సోంపేట) హాజరయ్యారని తెలుగు యువత పట్టణ ప్రధాన కార్యదర్శి వజీద్ జిలాని చెప్పారు. ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా వేదికలను పార్టీ ప్రచారానికి ఎలా వినియోగించుకోవాలి, ఎలాంటి భాష వాడాలి అన్న అంశాలను శిక్షకులు బ్రహ్మం, గ్రీష్మ ప్రతాప్ వివరించారని వెల్లడించారు. సోషల్ మీడియా ప్రధాన ప్రచార మాధ్యమంగా మారిందని పేర్కొన్నారు.