శ్రీకాకుళం

ఓటరు నమోదు కార్యక్రమంలో సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, డిసెంబర్ 17: ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు గ్రామాల్లో ఓటరు నమోదు కార్యక్రమానికి సహకరించాలని రెవెన్యూ పరిశీలకులు రావాడ త్యాగరాజు అన్నారు. మండలం పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల ద్వారా నమోదు కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు. అర్హత ఉన్న ప్రతీ ఓటరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి
కవిటి, డిసెంబర్ 17: రానున్న ఎన్నికల్లో గెలుపే పరమావధిగా భావించి పార్టీబలోపేత దిశగా ప్రతి కార్యకర్త సైనికుడుగా పనిచేయాలని రాష్ట్ర వైఎస్సాఆ ర్ కాంగ్రెస్ నాయకుడు, జిల్లా పార్టీ పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి అన్నా రు. ఆదివారం జమయ్యదారిపుట్టుగ దగ్గర జాతీయరహదారి పక్కన ఉన్న జెన్నాతోటలో నియోజకవర్గస్థాయి ము ఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ఇచ్ఛాపురం నియోజకవర్గం అంటే పార్టీ అధినేత జగన్‌కు ఎంతో మక్కువ అని, సోనియాగాంధీని సైతం ఎదిరించి ఓదార్పు యాత్రను రాష్ట్రంలోనే ఇచ్ఛాపురంలో ప్రారంభించి ఆనాటి ప్రజల ఆదరణను ఇక్కడ నాయకులు చేసిన కృషిని జగన్ ఏ నాటికి మరిచిపోరని, అటువంటి అధినేతకు రానున్న ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి పార్టీని గెలిపించి ఆయనకు కానుకగా ఇచ్చేందుకు నియోజకవర్గ నాయకులంతా ఏకతాటిపై ఉం డి పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో జగన్ పాదయా త్ర మొదలైన నాటి నుంచి అన్ని వర్గా లు, కులాల, మతాలవారు తమతమ సమస్యలను నేరుగా జగన్‌కు వివరించే అవకాశం ఉంటుందన్నారు. పార్టీలో భేదాభిప్రాయాలు వీడి అధినేత ఏ వ్య క్తికి టికెట్టు ఇచ్చిన ఆయన గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. స మావేశంలో జరిగిన ప్రతి విషయాన్ని అధినేత దృష్టికి తీసుకువెళ్లడమే తన కర్తవ్యమని కార్యకర్తలు తెలుసుకోవాలన్నా రు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ వైకాపాకు ఉన్న క్యాడర్ చాలా గట్టిదని, సమష్టిగా కృషి చేస్తే వైకాపా గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి నర్తు రామారావు మాట్లాడుతూ గత 8 ఎన్నికలను పరిశీలిస్తే ఒక్కసారే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉందని, దానిని బద్దలు కొట్టడానికి తాను సైతం సిద్దంగా ఉన్నానని, పార్టీ నాయకులు, కార్యకర్తలంతా పూర్తి సహాయసహాకారాలు అందిస్తే రానున్న ఎన్నికల్లో గెలుపు మనదేనన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మె ల్యే ధర్మాన కృష్ణదాస్, వైకాపా ప్రధాన కార్యదర్శి రెడ్డిశాంతి, మున్సిపల్ చైర్‌పర్సన్ పి.రాజ్యలక్ష్మి, కంచిలి ఎంపిపి ఇప్పిలి లోలాక్షి పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరులో...
వజ్రపుకొత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతిలో వటవృక్షం లాంటి వాడని శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన కరుణకరరెడ్డి అన్నారు. ఆదివారం వజ్రపుకొత్తూరులో పలాస నియోజకవర్గ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు జీవితమంతా అవినీతితోనే మొదలైందని కథల రూపంలో వివరించారు. ఆ వటవృక్షం మహావృక్షమై రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందన్నారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డదారిలో అవినీతి సొమ్ముతో కొనుగోలు చేస్తున్నారన్నారు.