శ్రీకాకుళం

రైల్వే జోన్ సాధనే లక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 17: ఉత్తరాంధ్రా జిల్లాల కల నెరవేర్చేలా విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ సాధనే లక్ష్యంగా ప్రైవేట్‌మెంబర్స్ బిల్‌ను ప్రవేశపెట్టినట్టు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టంచేశారు. ఈ పార్లమెంటరీ సమావేశాల్లో రైల్వేజోన్‌పై చర్చకు తీసుకురావాలన్నదే తన ముందున తక్షణ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం న్యూఢిల్లీ నుంచి ‘ఆంధ్రభూమి’తో ఎంపి రామ్మోహన్‌నాయుడు ప్రత్యేకంగా మాట్లాడారు. మెంబర్ బిల్లుపైనే అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. దాని చర్చకు తీసుకురావాలన్నదే నా ముందున్న కర్తవ్యమన్నారు. తొలుత బిల్లు ప్రవేశానికి అనుమతి రావాల్సి ఉంది. ప్రైవేటుమెంబరు బిల్లుకు కేటగిరి ఏ ,బి లు ఉంటాయి. బిల్లు ప్రాధాన్యం, తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ బిల్లు చర్చకు వచ్చేలా చూడాలని కమిటీని కోరడం జరిగిందని తెలిపారు. కేంద్రం నిధులిచ్చేలా ఒప్పించి శ్రీకాకుళం అభివృద్ధికి బాటలు వేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం నగరాన్ని అమృతాపథకంలో రూ.296 కోట్లు నిధులతో ఇక్కడ ప్రజలకు మరిన్ని వౌలిక వసతులు కల్పించనున్నాము. రహదారుల విస్తరణ, అండర్‌డ్రైనేజ్, స్వచ్ఛ్భారత్‌తో మరుగుదొడ్ల నిర్మాణం, వివిధ పార్కులు అభివృద్ధి వంటి ప్రధానాంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జాతీయ రహదారి పనులు ఆరంభమయ్యాయని తెలిపారు. జిల్లాలో ఇంకాకొత్తగా జాతీయ రహదారులు మంజూరు చే యించుకోవాలని తెలిపారు. కళింగపట్నం ఆమదాలవలస, పార్వతీపురం రోడ్డు జిల్లాకు చాలా ప్రాధాన్యమైనదని ప్రస్తుతం ఆర్ అండ్ బిలో ఉందని దీనిని హైవేకింద మార్పు చేయాల్సి ఉందన్నారు. కళింగపట్న, శ్రీ కాకుళం, ఆమదాలవలస, పాలకొండ, పార్వతీపురం సి పి రోడ్డు వరకు ప్రధాన పట్టణాల మీదుగా ఉండటం వలన రోజురోజుకీ రద్దీ పెరుగుతుంది. హైవేగా అభివృ ద్ధి చేసుకోవడానికి ఇప్పటినుంచే దృష్టి పెట్టాల్సి ఉంది. కోస్టర్ కారిడార్‌లో భాగంగా పలు రోడ్లు ఏర్పాటు చేసుకుంటే పరిశ్రమలు, పర్యాటక రంగం అభివృద్థితోపాటు మత్స్యకారుల అభివృద్ధికి బాటలు వేసినట్లవుతుంది. ఈ ప్రతిపాధనను కేంద్రమంత్రి నితిన్‌గట్కారీని కలిసి వివరించినట్లు తెలిపారు. ఒడిషా లోని కటక్‌లో రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. దానికి ఉపకేంద్రంగా జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాను. నైర కళాశాలలో సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు 25 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. ఈ ఇన్‌స్టిట్యూట్ ఫలితాలు జిల్లా నుండి రాష్ట్ర రైతులకు అందే విధంగా కృషి చేయడం జరుగుతుంది. నరసన్నపేట నుండి పాతపట్నం పర్లాకిమిడి మీదుగా ఒడిషాలోని మోహన్ వరకు హైవేగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం గుర్తించింది. జిల్లాలో ప్రత్యేక ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పడానికి సంబంధిత మంత్రితో చర్చించడం జరిగింది. చేనేతలో ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పొందూరుకు టెక్స్‌టైల్ పార్కును తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాన్నారు. ఉద్దానం మూత్ర పిండ వ్యాధి గ్రస్తులకు రాష్ట్రప్రభుత్వం పింఛన్లు, మందులు ఇచ్చి ఆదుకుంటుంది. స్థానికంగా పరిశోదనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యాధి మూలాలు కనుగొనడమే దీనికి శాశ్వత పరిష్కారం.

మహా శక్తిపీఠం శ్రీచక్రాపురం
ఎచ్చెర్ల, డిసెంబర్ 17: శ్రీచక్రాపురం అస్సాం రాష్ట్రంలో ఉన్న కామాఖ్యశక్తిపీఠం మాదిరీగా పేరుప్రఖ్యాతలు మూటకట్టుకోవడం ఖాయమని అస్సాం రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ(ఫైనాన్స్) కోత రవి అన్నారు. ముఖ్యంగా తన సొంత జిల్లాలో ఇటువంటి ఆలయం అందులోనూ ప్రపంచంలో లేనటువంటి ఈ ఏకోత్తర సహస్ర శ్రీచక్రమేరువులు శ్రీచక్రపీఠమన్నారు. ఆదివారం శ్రీచక్రాపురాన్ని దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీకి సాంప్రదాయప్రకారం ఘనంగా పీఠాధిపతి బాలుస్వామి స్వాగతం పలికి ఆలయ విశిష్ఠతను వివరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీచక్రాపురం లో ఉన్న ఆ నుండి క్ష వరకు ఉన్న ఆకార క్షాకార దేవతామూర్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా తొమ్మిదడుగుల మహామేరువు ఏకశిలగా ఏ విధంగా ఇక్కడకు తెచ్చారని ఆయన ప్రశ్నించారు. తప్పకుండా ఈ ఆలయం గురించి మీరు చేస్తున్న మహాయజ్ఞం గురించి అస్సాం రాష్ట్ర సి ఎంకు తెలియజేసి యాగంకు ఆయనను తీసుకురావడానికి ప్రయత్నిస్తానన్నారు. ఇటువంటి ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు. అస్సాంలో ఉన్న తెలుగువారికి కోటిశివలింగ బాణామందిర నిర్మాణంలో, యజ్ఞం నిర్వహణలో తెలియజేసి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 5 నుంచి జరగబోవు ఏర్పాట్లను పరిశీలించి ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ యాగం ఓ అద్భుతమని కొనియాడారు. యాగానికి సంబంధించిన మట్టి శివలింగాలను పరిశీలించారు. అదే విధంగా 18 అడుగుల మహాశివుని ప్రతిమను తయారు చేస్తున్నవైనాన్ని శిల్పి జోగారావును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ సభ్యులు పప్పల రాధాకృష్ణ, రమేస్, చంద్రరావు, ప్రచార కన్వీనర్ గురుగుబెల్లి లోకనాధం, దుప్పల వెంకటరావు, గీతాశ్రీకాంత్, తమ్మినేని గోవిందరావు, యాగనిర్వహణ కమిటీ సభ్యులు పలువురు భక్తులు ఉన్నారు.