శ్రీకాకుళం

పెద్దలతో సత్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లావేరు, జనవరి 17: గ్రామంలో వయోవృద్దులకు సత్కారం చేసే సత్సాంప్రదాయాన్ని మండలంలో లక్ష్మీపురం గ్రామ పంచాయతీ నాంది పలికింది. పర్వదినాలను పురష్కరించుకుని గ్రామంలో వయోవృద్దులు బాట అనుసరణీయమని వారిని సత్కరించడం సంప్రదాయాలలో భాగమని లక్ష్మీపురం గ్రామ ప్రజానీకం భావించింది. ఇందులో భాగంగా ఆ గ్రామానికి చెందిన విశ్రాంత వి ఆర్వో రామారావు, విశ్రాంత ఉపాధ్యాయులు పి.బాబూరావు, సూర్యనారాయణ, ఏ.రామారావు, జ్యోతాస్కులు ఎం.కృష్ణారావుశర్మ, మాజీ డీలర్ బోర రామన్నలను బుధవారం సత్కరించారు. ఎంపిటీసీ బోర పారోతి పార్వతి దంపతులు తమ చేతులమీదుగా దుస్సాలువాతో సత్కరించారు. పూర్వీకుల మాటలు నేటి యువత ఆదర్శనీయంగా తీసుకొని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని వారు సూచించారు. ఈసందర్భంగా కబడ్డీ, మ్యూజికల్ చైర్, డ్యాన్స్ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని 6 గ్రామలకు చెందిన యువతకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి.వెంకటరమణ, బి.జగన్, బోర వెంకటరమణ, దుర్గారావు, సిహెచ్ రమణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అమ్మకు వందనంకు రూ.1.25కోట్లు కేటాయింపు
లావేరు, జనవరి 17: వసంత పంచమి పర్వదినం పురష్కరించుకుని ఈ నెల 22న పాఠశాలల్లో అమ్మకు వందనం కార్యక్రమానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమ్మ ఆవశ్యకతను ప్రాధాన్యతను పిల్లలు గుర్తించేలా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. ఈ మేరకు కార్యక్రమ నిర్వహణకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమీషనర్ జి.శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5వేల పాఠశాలల్లో రూ.1.25కోట్లు నిధులను కేటాయించారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 25 ప్రభుత్వ పాఠశాలలు, 311 జిల్లా పరిషత్ పాఠశాలలు, 14 మోడల్ స్కూల్స్, మరో 14 మున్సిపల్ పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందుకు గాను జిల్లాలో 366 పాఠశాలలకు సంబంధించి నిధులను కేటాయించారు. ప్రధానంగా ఆ రోజున ఆయా పాఠశాలల్లో విద్యార్దుల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని సత్కరించి విద్యార్ధులచే ఆ తల్లిదండ్రులకు పాధాబివందనం చేసేందుకు కార్యక్రమం సిద్ధం చేశారు. నేటి సమాజంలో తల్లి ఆవశ్యకతను విద్యార్ధులు విస్మరిస్తున్న దశలో అమ్మకు వందన కార్యక్రమంద్వారా అమ్మ గొప్పతనాన్ని మరింతగా విస్తృత పరిచేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.