శ్రీకాకుళం

జేఏసి పేరుతో దగా చేయవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, జనవరి 17: రాష్ట్రంలోని బోయి, వాల్మీకి కులాలను గిరిజనుల జాబితాలో చేర్చడానికి వీలుగా రాష్టమ్రంత్రి మండలి చేసిన తీర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించడానికి గిరిజన సంఘ ఐక్యవేదికను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మండల గిరిజన సంఘం నాయకులు చౌదరి లక్ష్మీనారాయణ, రామారావు తదితరులు ప్రకటించారు. అయితే ఈ ప్రక్రియ కోసం జె ఏ సి ఏర్పాటైనట్లు వాబ యోగిని అధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు కొంతమంది ప్రకటనలు గుప్పించి గిరిజన సంఘాలను మోసగించుతున్నారని ఇటువంటి దగాకోరు ప్రకటనలు చేయవద్దని వీరు హెచ్చరించారు. సీతంపేట ఐ టి డి ఏ కార్యాలయం ఆవరనలో త్వరలో జిల్లాలోని అన్ని గిరిజన సంఘాల ప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు విస్తత్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసి జె ఏ సిని ఏర్పాటు చేస్తామని వీరు స్పష్టంచేశారు. బుధవారం స్థానికవిలేఖర్లతో వీరు మాట్లాడుతూ గిరిజనుల పోరాట పటిమను బలహీనపరచవద్దని విజ్ఞప్తి చేశారు.

కన్నుల పండువగా హలహలేశ్వర స్వామి యాత్ర
నరసన్నపేట, జనవరి 17: మండలం శ్రీరాంపాడులో వెలసియున్న శ్రీ హలహలేశ్వర స్వామి యాత్ర కన్నుల పండువగా కొనసాగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా టెక్కలి పాడు గ్రామం నుంచి వేలాదిమంది భక్తులు హలాలను చేతపట్టి పొలాల గట్లపై పరుగెడుతూ వచ్చి స్వామివారి ఆలయానికి చేరుకుని మూడు ప్రదర్శనలు చేసిన అనంతరం యాత్ర ప్రారంభమైంది. ప్రతీ ఏడాది ముక్కనుమ రోజున ఈ యాత్ర నిర్వహించడం సాంప్రదాయకంగా కొనసాగుతుంది. దీని చరిత్ర చూస్తే ఉర్లాం జమిందారులు కాశీ నుండి శివలింగాన్ని తీసుకుని వచ్చి తమ సంస్థానంలో ప్రతిష్ట చేయదలిచారు. ఈ దిశగానే కాశీ నుంచి శివలింగాన్ని నాటుబండిపై తీసుకుని వస్తుండగా శ్రీరాంపాడు వద్ద నాటుబండి విరిగిపోయి శివలింగం భూమిపై పడింది. దీనిని తరలించేందుకు అప్పటి రాజవంశీయులు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఇక్కడే దానిని ప్రతిష్ట చేసి పూజాధి కార్యక్రమాలు నిర్వహించడం నేటికీ జరుగుతూనే ఉంది. ప్రతీ ఏడాది ముక్కనుమ రోజున వేలాది మంది భక్తులు చేరి స్వామివారికి పూజలు చేయడం ఆనవాయితీగా మారింది. ఈప్రాంతమంతా భక్తుల కోలాహాలంతో పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా జనమయమయింది. ఈసందర్భంగా నిర్వాహకులు ఎస్.లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఉచితంగా ప్రసాదాలను కూడా భక్తులకు అందజేశామని తెలిపారు.