శ్రీకాకుళం

రాణలో ముఖలింగేశ్వరుని యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, జనవరి 17: మండలం రాణ గ్రామంలో శతాబ్దాల క్రితం నుంచి నిర్వహిస్తున్న శ్రీముఖలింగేశ్వర యాత్ర మహోత్సవాన్ని బుధవారంఘనంగా నిర్వహించారు. దివంగత తర్ర అప్పయ్యనాయుడు, లింగమూర్తి, రామలక్ష్మణ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యాత్రను పురష్కరించుకుని భక్తుల ఆనందం కోసం పలు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. రాత్రికి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింగాలవలస, జలుమూరు, చల్లవానిపేట, రాణ, పెద్దదూగాం, చినదూగాంనుంచి ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

8 కాళ్లతో గొఱ్ఱెపిల్ల జననం
సారవకోట, జనవరి 17: మండలంలోని తొగిరి గ్రామంలో గురుబిల్లి సూర్యనారాయణ అనే రైతు వద్ద ఉన్న పెంపుడు గొఱ్ఱె బుధవారం 8కాళ్లు, మూడు చెవులతో ఉన్న గొఱ్ఱెపిల్లలకు జన్మనిచ్చింది. ఈ వింత గొఱ్ఱెపిల్లను చూసిగ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కొద్దిసేపు మాత్రమే జీవించి ఉన్న గొఱ్ఱెపిల్ల మృతిచెందింది. ఈ విషయాన్ని పశువైద్యాధికారి డా. అనీల్ వద్ద ప్రస్తావించగా రెండు అంగములు ఉద్భవించడంగానీ, లేదా జన్యుపరమైన లోపాల వలన గానీ ఇటువంటి శిశువులు జన్మించడం జరుగుతుందని అదనపు అవయవాలు తల్లిగర్భంలో పెరుగుతాయని వివరించారు.

ఆంజనేయస్వామి ఉత్సవాలు ప్రారంభం
సారవకోట, జనవరి 17: మండలంలోని తొగిరి గ్రామంలో గల అభయాంజనేయస్వామి ఆలయ 12వ వార్షికోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆలయ పూజారి పూసపాటి రామానుజాచార్యుల పర్యవేక్షణలో విఘ్నేశ్వర పూజ, నవగ్రహమండపారాధన, పుణ్యాహవచనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవాలు ప్రారంభానికి సూచనగా ద్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టారు. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మాజీ జెడ్పిటీసీ నామగిరి జగన్నాద్‌దాస్ దొర దంపతులు, పలువురు భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.