శ్రీకాకుళం

ఆగని కోడి పందాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్),జనవరి 18: కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ నాయకులు కోడి పందెంల పేరుతో కోట్లాది రూపాయలు అక్రమ సంపాదనకు తెరలేపారని అమాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా టీడీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత అక్రమాలకు తావిచ్చి గౌరవ న్యాయస్థానాల తీర్పును సైతం గౌరవించక విచ్చలవిడిగా నడిబజార్‌లలో మూగజీవాలను అడ్డంపెట్టి జూదం ఆడుతుంటే పోలీసులు వారికి చుట్టాలయ్యారన్నారు. గ్రామాల్లో సంక్రాంతి రోజున సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారాలను పక్కన పెట్టి వాటిని మంటగొలిపే విధంగా కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి జూదక్రీడలను ప్రోత్సహిస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలన్నారు. కత్తులు కట్టి కోళ్లతో పందెంలు నిర్వహించడం జీవహింస అని ఈ పందెంల పేరుతో నిర్వహించే జూదంతో మధ్య, దిగువ తరగతి కుటుంబాలు నాశనం అవుతున్నాయన్నారు. టీడీపీ నేతలు బరితెగించి కోట్లాది రూపాయలతో జూదం ఆడుతుంటే పోలీసులు చట్టం కళ్లు కుట్టేసి, తలుపులు మూసేసి జూదరులతో పాటు పోలీసులు కూడా కోడికాళ్లకు కట్టిన కత్తులతో ఆనందించి ఏదో కేసులు పెట్టామని అమాయకులపై చర్యలు తీసుకుంటున్నారన్నారు. వై ఎస్ జగన్ ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక హోదా కావాలని నిరంతరం పోరాటాలు చేస్తుంటే అడుగడుగునా అడ్డుకున్న పోలీసులకు నడిరోడ్డుపై కోట్లాది రూపాయలతో జూదం ఆడుతున్న టీడీపీ నాయకులు కనబడలేదా? అని దుయ్యబట్టారు. కోర్టు ఆదేశాలను గౌరవించి వాటిని అమలు చేసే సత్తా పోలీసుల్లో సన్నగిల్లిందన్నారు. గౌరవ న్యాయస్థానాల ఆదేశాలను అటు ప్రభుత్వం, ఇటు అధికారుల సైతం గౌరవించకపోవడం, మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బయటకు వచ్చి పాత్రికేయుల సమావేశంనిర్వహించడం వంటి అంశాలు చూస్తున్న ప్రజల్లో న్యాయవ్యవస్థపై, చట్టాలపై అభద్రతా భావం ఏర్పడే అవకాశం ఉందన్నారు. కోడి పందెంలు వేయవద్దని కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి పందెంలు వేస్తే కనుక అందుకు డీజీపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత వహించాలన్న కోర్టు హెచ్చరిక వేడెక్కుతుందో లేక చల్లబడుతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ సమావేశంలో యజ్జల గురుమూర్తి, ఆర్ ఆర్ మూర్తి, మహేశ్వరరావు, బి.రాజీవ్ లు పాల్గొన్నారు.

ఓపెన్ యూనివర్శిటీ ప్రాక్టికల్ తరగతులు
శ్రీకాకుళం(టౌన్), జనవరి 18: డా.బి. ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2017-18 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం డిగ్రీ సైన్స్ విద్యార్ధులకు సెమిస్టర్-1 కంపల్సరీ ప్రాక్టికల్ ట్రైనింగ్ తరగతులు ఈనెల 19 నుండి ప్రభుత్వ పురుషుల డిగ్రీకళాశాల సైన్స్ ల్యాబ్‌లలో నిర్వహిస్తున్నట్లు సమన్వయ కర్త జి.లచ్చన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తరగతులకు శ్రీకాకుళం, టెక్కలి, పలాస, పాతపట్నం, ఇచ్ఛాపురం, పార్వతీపురం, ఓపెన్ యూనివర్శిటీ స్టడీ సెంటర్లలో డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ ఫీజు చెల్లించిన సైన్స్ విద్యార్ధులు తప్పక హాజరు కావాలన్నారు. ఈ తరగతులకు హాజరు కాని విద్యార్ధులు ప్రాక్టికల్ పరీక్షలకు అనుమతించబడరని కావునా మొదటి సంవత్సరండిగ్రీ సైన్స్ విద్యార్ధులు తమ ఫీజు రశీదులతో పాటు సెమిస్టర్-1 ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాలని ఆయన కోరారు.