శ్రీకాకుళం

ఎమ్మార్సీని సందర్శించిన డిఈవో సాయిరాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, జనవరి 18: జిల్లా వ్యాప్తంగా మండల విద్యావిభాగానికి సంబంధించిన ఎమ్మార్సీ కేంద్రాలు సందర్శన నేపథ్యంలో జిల్లా విద్యాధికారి ఎ.సాయిరాం గురువారం స్థానిక ఎమ్మార్సీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో వివిధ అంశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయులకు సంబంధించిన ఎస్.ఆర్‌లతో పాటు ఈ.ఎల్. నమోదులను పరిశీలించారు. అదేవిధంగా సి.ఆర్పీలతో వారియొక్క విధి విధానాలుపై సమీక్షించారు. పాఠశాలల పర్యవేక్షణలో చేస్తున్న కార్యకలాపాలుతో పాటు టూర్ డైరీలను పరిశీలించారు. ఈయన వెంట మండల విద్యాధికారి మామిడి భాస్కరరావు, సి.ఆర్పీలు ఉన్నారు.

మరుగుదొడ్డి నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే.. తప్పదు
గార, జనవరి 18: ప్రభుత్వం ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మాణాలు తప్పనిసరి చేసిన నేపథ్యంలో పంచాయితీలు వారీగా మరుగుదొడ్డి నిర్మాణాలుపై యంత్రాంగం పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ప్రతి పంచాయితీ ఆరుబయట మలవిసర్జన రహిత పంచాయితీగా తీర్చిదిద్దేందుకు చర్యలు ముమ్మరం చేసారు. ఈ నేపథ్యంలోనే రానున్న మార్చి నాటికి ఆరుబయట మల విసర్జన రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే గురువారం స్తానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల అధికార ప్రతినిధి గుండ భాస్కరరావు ఆధ్వర్యంలో అధికారులు మరుగుదొడ్డి నిర్మాణాలు లక్ష్యాలు అధిగమించేందుకుగాను సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయితీ కార్యదర్శులు, పంచాయితీ స్థాయి ప్రత్యేక అధికారులుతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిర్మాణాలు త్వరితగతిన పూర్తి, చెల్లింపులు, జియోటాంగింగ్ మొదలైన పలు అంశాలుపై చర్చించారు. ఇప్పటికే మరుగుదొడ్డి నిర్మాణాలు పూర్తి చేయని కుటుంబాలకు రేషను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసిన అధికారులు పెన్సన్లు కూడా నిలుపుదల చేయనున్నామని హెచ్చరించారు. దీనికి తోడు మరుగుదొడ్డి నిర్మాణాలు పూర్తిలో లక్ష్యాలు అధిగమించని పంచాయితీలకు పద్నాలుగువ ఆర్ధిక సంఘం నిధులు నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరుగుదొడ్డి నిర్మాణాలు లక్ష్యాలు అధిగమించే దిశగా అధికారులు ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు.