శ్రీకాకుళం

సాంఘిక ఉద్యమకారుడు ఎన్టీఆర్!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 18: తెలుగుజాతి గుండెల్లో చెరగని జ్ఞాపకం..నిలువెత్తు స్ఫురద్రూపం..క్రమశిక్షణకు పర్యాయపదం..తెలుగువారి ఆత్మగౌరవం ప్రతీక..అన్నీ కలగలిపి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుయుగ పురుషుడు. ఆయన ఆశయసాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు. గురువారం ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఇక్కడ ఏడురోడ్ల కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా పరిపాలనలో తనకుంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొని, పరిపాలనను ప్రజల ముంగిట నిలిపిన సి.ఎం. ఎన్టీఆర్ అన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో ప్రచార రథంపై సుడిగాలి పర్యటన చేసి, అంతర్గత కుమ్ములాటలో కొట్టుమిట్టాడే కాంగ్రెస్ నాయకులు డిల్లీ అధిష్టానం చేతిలో కీలుబొమ్మలుగా మారడాన్ని ప్రచారాస్త్రాలుగా చేసుకుని ఆయన చేసిన ప్రసంగాలు తెలుగువారి గుండెల్లో పౌరుషాగ్నిని నిలిపాయన్నారు. ప్రజలే దేవుళ్ళు - సమాజమే దేవాలయం అంటూ ప్రజాసేవలో తరించిన లెజెండ్‌గా తెలుగోళ్ళ మదిలో నిలిచిపోయన మహావ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. స్ర్తిలకు ఆస్తి హక్కునిచ్చి, ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని తెలుగు ప్రజలల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసిన మహాపురుషుడంటూ కొనియాడారు. గ్రామీణ జీవితాన్ని ఫ్యూడల్ శక్తుల కబంద హస్తాల నుంచి విడిపంచేందుకు మునసబు - కరణం వ్యవస్థలను రద్దు పరిచి బడుగు - బలహీనవర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దగ్గరకు చేర్చిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీనిగా కాదని, ఒక సాంఘిక విప్లవం తేవడానికి ఉద్దేశించిన ఉద్యమంగా ఆయన చెప్పే వ్యాఖ్యలను రామ్మోహన్‌నాయుడు గుర్తుచేసారు. విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ ఎన్టీరామారావుకు ప్రతీ తెలుగోడు నివాళులర్పించాల్సిన అవసరం ఉందన్నారు. యావత్ తెలుగుజాతి నమ్మకాన్ని ప్రపంచంలోనే చాటిచెప్పారన్నారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏ లక్ష్యం కోసం ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ లక్ష్యం నెరవేరేలా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేస్తున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలు తెలుగు ప్రజల కోసం అమలు జరుపుతున్నారని తెలియజేశారు. పేదరిక నిర్మూలన, ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఎన్టీ రామారావు ప్రతీ తెలుగువాడికి గుర్తుండాలన్నారు. ఎన్టీ ఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఈ విషయంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలకు ఎన్టీఆర్ బిక్షేనన్నారు. కే సి ఆర్‌కు కూడా ఎన్టీ ఆర్ బిక్షేనని స్పష్టంచేశారు. ఎన్టీఆర్‌కు నిజమైన నివాళులర్పించాంటే ఆయన పౌరుషాన్ని, ఆత్మగౌరవాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. భవిష్యత్‌లో ఏ కార్యక్రమం చేసినా ఎన్టీఆర్ లక్ష్య సాధనగా కృషి చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఎన్టీఆర్‌కు సన్నిహిత సంబంధం ఉందని బీసి ఉద్యమానికి న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతీ తెలుగువాడు ఎన్టీఆర్‌కు నివాళులర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ సంక్షేమం అంటే తెలుగుదేశం అని దీనిని స్ధాపించింది దివంగత నేత ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. జెడ్పి చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. ఈకార్యక్రమంలో టీడీపీ పూర్వపు అధ్యక్షులు చౌదరి బాబ్జీ, నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణం, జామి భీమశంకర్, సీర రమణయ్య, చిట్టి మోహన్, ఎస్‌వి రమణమాదిగ, సీపాన రమ, దుంగ శ్రీ్ధర్, కరగాన రాము, భాస్కర్, కవిత, వంకాయల సూర్యప్రకాశ్, మూకళ్ల శ్రీనివాసరావు, ఇప్పిలి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం మరొకరికి ప్రాణదానం
* ఎంపీ రామ్మోహన్‌నాయుడు
శ్రీకాకుళం(రూరల్), జనవరి 18: రక్తదానం మరొకరికి ప్రాణదానవంటిదని మరొకరికి ప్రాణదానం వంటిదని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఎంతోమంది క్షతగాత్రులు అత్యవసర సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారని అటువంటివారిని ఆదుకునేందుకు యువత రక్తం దానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఎన్టీ ఆర్ వర్థంతి సందర్భంగా జిల్లా రక్తనిధి భవనంలో గురువారం రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలతో పాటు సేవా దృక్పధాన్ని కూడా అలవర్చుకోవాలని అందులో భాగంగానే రక్తదానం కూడా సేవా దృక్పధమేనన్నారు. ప్రతీ ఒక్కరూ రక్తదానం చేసి క్షతగాత్రులను ఆదుకోవాలన్నారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన యువతను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, జెడ్పి చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణం, చిట్టి మోహన్, సీర రమణయ్య, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, సీపాన రమ, పి.చినమహాలక్ష్మీ, కవిత తదితరులు పాల్గొన్నారు.

23న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
శ్రీకాకుళం(రూరల్), జనవరి 18: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నగేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22న సమావేశం నిర్వహించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ శాసన మండలి హామీల కమిటీ వస్తుండటంతో 23న నిర్వహించేందుకు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. సభ్యులు ఈ అంశాన్ని గమనించాలని కోరారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావాలని

రాజకీయాల్లో చరిత్రకారుడు ఎన్టీ ఆర్
* విప్ రవికుమార్
ఆమదాలవలస, జనవరి 18: పార్టీని స్థాపించి 9 నెలలకే విజయభేరి మోగించి దేశ రాజకీయ చరిత్రలో సంచలనం సృష్టించిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రాజకీయాల్లో ఓ చరిత్ర కారుడిగా నిలిచిపోయారని ప్రభుత్వవిప్ కూన రవికుమార్ కొనియాడారు. గురువారం ఎన్టీ ఆర్ వర్థంతి సందర్భంగా స్థానిక ఇండస్ట్రియల్ పార్కు వద్ద ఉన్న ఎన్టీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలన, జవాబుదారీ విధానం, పేదవాడికి కూడు, గుడ్డ నీడ వంటివి ఉచితంగా కల్పించాలనే మహా ఆశయంతో పార్టీని స్ధాపించి ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపించిన ముఖ్యమంత్రి ఎన్టీ ఆర్ సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్టీ ఆర్ ఆశయాలు, లక్ష్యాలను లక్ష్యంగా తీసుకొని పాలన సాగిస్తున్నారన్నారు. అనంతరం కెవిసి వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీత, ఎంపిపి ప్రతినిధి తమ్మినేని శేఖర్, దేశం నాయకులు విద్యాసాగర్, మెట్ట సుజాత, కొండబాబు, బోర గోవింద్, నూక రాజు, సనపల ఢిల్లీ, కోట రామారావు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

మంచుతో ప్రయాణీకుల ఇక్కట్లు
జలుమూరు, జనవరి 18: అర్థరాత్రి నుంచి తెల్లవారి సూర్యోదయం వరకు మంచు విపరీతంగా కురియడంతో ప్రయాణీకులు అనేక అవస్థలు పడ్డారు. తెల్లవారు జామున తమ గ్రామాల నుంచి బయలుదేరే సమయాన పొగమంచు పడటంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఏర్పడిందని పలువురు ప్రయాణీకులు వాపోతున్నారు. తెల్లవారు జామున చెట్లనుండి చిన్న వర్షపు జల్లులు పడుతుండటంతో ప్రమాదాలు వస్తున్నాయని వారు వాపోతున్నారు.

ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయండి: ఎమ్మెల్యే
నరసన్నపేట, జనవరి 18: ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయంగా నినాదాన్ని అందిపుచ్చుకుని తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీ ఆర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక ఆదివరపుపేటలో ఇటీవల ప్రతిష్టించిన ఎన్టీ ఆర్ విగ్రహానికిపూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నేటికి ఆయన మృతి చెంది నేటికీ 22 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయన చేసిన సేవలు నేటికీ కళ్లముందు కదలాడుతున్నాయని అంతటి నేత వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని స్పష్టంచేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శిమ్మ పార్వతమ్మ, దేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాదు చిన్నికృష్ణంనాయుడు, మండల విప్ గోవిందరావు, ఎంపిటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

రూ.10 కోట్ల పనులపై సామాజిక తనిఖీలు ప్రారంభం
నరసన్నపేట, జనవరి 18:మండలంలోని ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సామాజిక తనిఖీలను నిర్వహించడం జరుగుతుందని సి ఆర్‌పి అచ్యుతరావు తెలిపారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016 నవంబర్ నుంచి ఉపాధి హామీ పనులకు సంబంధించి రూ.9.59కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని అలాగే పంచాయతీ రాజ్‌శాఖకు సంబంధించి 92 పనులకు రూ.1.80కోట్ల నిధులను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. దీనికి సంబంధించి ఈనెల 21 నుంచి పంచాయతీలలో సామాజిక తనిఖీలు నిర్వహిస్తామని వారం రోజుల పాటు ఇవి కొనసాగనున్నాయని ఆయన స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సి ఆర్‌పిలు రామారావు, హరి తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శపురుషుడు ఎన్టీఆర్
సారవకోట, జనవరి 18: సినీ నటుడుగా విఖ్యాతినొందిన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు రాజకీయాలలో నూతన ఒరవడి సృష్టించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటంలో ఆదర్శపురుషుడుగా నిలిచారని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సాదు చిన్నికృష్ణంనాయుడు కొనియాడారు. ఎన్టీ రామారావు 22వ వర్థంతి సందర్భంగా స్థానిక తెలుగుదేశంపార్టీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల టీడీపీ అధ్యక్షుడు వరుదు రాఘవేంద్ర మాట్లాడుతూ ఎన్టీ ఆర్ ఆశయ సాధనకు పార్టీ కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. తొలుత ఎన్టీ ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా తెలుగుదేశంపార్టీ అధికార ప్రతినిధి కత్తిరి వెంకటరమణ, సురవరపు తిరుపతిరావు, ఏ ఎం సి ఉపాధ్యక్షులు రత్నాలనాయుడు, నీటి సంఘం అధ్యక్షుడు చిన్నాల మాధవరావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.