శ్రీకాకుళం

నత్తనడకన మినీ స్టేడియం నిర్మాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, జనవరి 19: మండల కేంద్రంలోని స్థానిక నర్సమ్మ చెరువు వద్ద రూ.2కోట్లతో మినీ స్టేడియం నిర్మాణానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాధనలు సిద్ధం చేసింది. అయితే ఈ పనులకు సంబంధించి కేవలం భూసార పరీక్షలతో అధికారులు సరిపెట్టుకోవడంతో వీటి పనులపై నియమాంసాలు నెలకొంది. శుక్రవారం డి ఎస్ డివో బి.శ్రీనివాసకుమార్ స్థలాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించి 8 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు అప్పగించారని త్వరితగతిన పూర్తి చేసేందుకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి ఉపాధి హామీ పథకం ద్వారా కొంతమేర పనులు చేపట్టవలసి ఉందని దీని వలనే కొంత జాప్యం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాద నివారణకు చర్యలు
* సి ఐ రామకృష్ణ
పొందూరు, జనవరి 19:రోడ్ల ప్రమాదాల నివారణకు వాహన దారులు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని రణస్థలం సి ఐ రామకృష్ణ అన్నారు. పొందూరు స్టేషన్‌కు పరిశీలనకై వచ్చిన సందర్భంగా అక్రమ క్వారీలు, పేలుళ్లపై నివారణకు డేగ కన్ను వేయాల్సి ఉందన్నారు. నెల వారీ కేసులు, రికార్డులను పరిశీలించారు. ఇటీవల కాలంలో మండలంలోని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున వాటిని అదుపుచేసేందుకు డ్రైవర్లకు శిక్షణ ఇస్తామన్నారు. వాహనచోదకులు మధ్యం మత్తులో వెళ్లేవారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ బాలరాజు సిబ్బంది పాల్గొన్నారు.

భూసర్వేకు రైతులు సహకరించాలి
పోలాకి, జనవరి 19: మండలంలో గల సుసరాం గ్రామపంచాయతీ పరిధిలో గల భూమిను మోడల్ సర్వే నిర్వహిస్తున్న వి ఆర్ వో జగన్నాధం తెలిపారు. ఈసందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ మీ భూములను మోడల్ సర్వే చేయించుకోవడం వలన రైతులు ఎప్పుడో కొన్న భూములు నేటి వరకుమార్చుకోకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదురౌతాయన్నారు. వారసత్వం ద్వారా వచ్చిన భూములు తనయులకు సర్దుకోవడం గ్రామాల్లో జరుగుతుంటుందని, కానీ భూదస్త్రాలలో పొందు పరుచుకోకపోవడం వలన కలిగే ఇబ్బందులను ఆయన వివరించారు. అందువలన ప్రతీ ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, రెవెన్యూ, పంచాయతీ తదితర సిబ్బంది పాల్గొన్నారు.