శ్రీకాకుళం

పశుగ్రాస, పోషకాల బాధ్యతే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, జనవరి 19: రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖకు సంబంధించి పాడి రైతులకు ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పశుసంవర్ధక శాఖ ఏడి కె.రాజ్‌గోపాల్ తెలిపారు. శుక్రవారం స్థానిక పశువైద్య కేంద్రంలో ఆయన మాట్లాడుతూ నరసన్నపేట, పోలాకి మండలాలలో 54 ఎకరాలలో 54 పశుగ్రాస క్షేత్రాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఇటీవల కాలంలో పచ్చగడ్డి కరువైపోవడంతో దీని స్థానంలో పాతరగడ్డిని అందుబాటులోనికి తీసుకువచ్చామని నేటివరకు నేరుగా రైతులకు 3,800 కిలోల మేరకు అందజేశామని వివరించారు. మార్చి నెల నుండి గడ్డి కావాల్సిన వారు ఆన్‌లైన్‌లో మీసేవ కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వాటి వివరాల ప్రకారం నేరుగా పాడి రైతులకే దీనిని అందించడం జరుగుతుందని స్పష్టంచేశారు. కిలో రూ.2చొప్పున దీనిని విక్రయించడం జరుగుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎస్టీ కుటుంబాలకు పెరటికోళ్ల పెంపకం పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని రూ.810కు 45 కోడి పిల్లలు అందించడం జరుగుతుందని సంబంధిత వివరాలకు పశువైద్యాధికారులను సంప్రదించాలని ఆయన తెలిపారు.

142 అంగన్వాడీ భవనాలు అవసరం
* పివో అనంతలక్ష్మీ
నరసన్నపేట, జనవరి 19: నరసన్నపేట ప్రాజెక్టు పరిధిలో 238 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని వీటిలో కొన్ని అద్ద్భెవనాల్లో కొనసాగుతున్నాయని ఐ సి డి ఎస్ పివో అనంతలక్ష్మీ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ నరసన్నపేట, పోలాకి మండలాలకు సంబంధించి 142 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని వీటి నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపడం జరిగిందని ఆమె తెలిపారు. అలాగే 15 అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిని త్వరలోనే ప్రభుత్వం భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు అన్ని విదాల పోషక విలువలను బట్వాడా చేయడం జరిగిందని అంగన్వాడీ కార్యకర్తలు తప్పనిసరిగా సమయవేళలు పాటించాలని ఆమె సూచించారు.