శ్రీకాకుళం

పాఠశాలలను తనిఖీ చేసిన చైల్డ్‌రైట్స్ కమిషన్ డైరెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, జనవరి 19: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సంక్రాంతి సెలవుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్న పట్టణంలో పలు ప్రైవేటు పాఠశాలలను శుక్రవారం రాష్ట్ర చైల్డ్‌రైట్స్ కమీషన్ డైరెక్టర్ ప్రసాదరావు ఆకస్మీక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడ రవీంధ్రభారతీ పబ్లిక్ స్కూల్ వద్ద విలేఖర్లతో మాట్లాడుతూ భోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ వంటి పండగ విశిష్టతలను ఉద్దేశించి ప్రభుత్వం అన్ని యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న పాఠశాలలకు ఈనెల 22 వరకు సెలవులు ప్రకటించిందని ఆయన తెలిపారు. ఈ పండగలో పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటూ తల్లిదండ్రులు, బంధువుల మధ్య కుటుంబ వికాసం, విలువలు తెలుసుకుంటారని ఆయన అన్నారు. నేటి తరం పిల్లలకు సంక్రాంతి సాంప్రదాయ విధానాలకు దూరంచేస్తూ చదువుల పేరుతో తరగతి గదుల్లో నిర్భందిస్తే క్షమించేది లేదని ఆయన హెచ్చరించారు. పోటీతత్వం పేరుతో పిల్లలపై మానసిక ఒత్తిడి పెంచుతున్నారని ఇక్కడ పాఠశాలల యాజమాన్యాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానాలు మారకపోతే రాష్ట్ర చైల్డ్‌రైట్స్ కమీషన్ ఆయా పాఠశాలలకు నోటీసులు జారీ చేస్తూ పాఠశాల గుర్తింపును రద్దు చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుందని డైరెక్టర్ హెచ్చరించారు. శ్రీవాణి, సాయిరాం, టింపనీ వంటి పాఠశాలలను తనిఖీ చేసి ఇక్కడ పిల్లలకు ఉండాల్సిన తాగునీరు, మరుగుదొడ్లు, ఆట స్థలాలు, విశ్రాంతి గదుల వంటి వౌలిక సదుపాయాలపై చర్చించి అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట మండలం విద్యాశాఖ అధికారులు, సి ఆర్ పిలు, ఐ ఇడి సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలి
లావేరు, జనవరి 19:ప్రజలు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలని ఏపి గ్రామీణ వికాస బ్యాంకు మురపాక శాఖ మేనేజర్ ఏ.చక్రధరరావు పిలుపునిచ్చారు. చినమురపాక పంచాయతీ చినరొంపివలస గ్రామంలో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పొదుపు పథకాలు వినియోగించుకొని ఆర్ధికాభివృద్ధి సాధించాలని సూచించారు. ప్రధానంగా జన్‌దన్‌యోజన కింద రూ.330కే రూ.2లక్షల భీమా పథకం ఉందన్నారు. జీవన్ సురక్ష, అటల్‌పెన్షన్‌యోజన, పంట రుణాలపై అవగాహన కల్పించారు. బ్యాంకు అందిస్తున్న మొబైల్‌యాప్‌ను వినియోగించుకోవడం ద్వారా ఇంటి వద్ద నుండే ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చునని సూచించారు. ఈకార్యక్రమంలో క్షేత్ర అధికారి రాజీవ్, తెలుగు యువత నాయకుడు విజయ్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పాత కుంకాం ఫీల్డ్ అసిస్టెంట్‌కు రాష్టస్థ్రాయి పురస్కారం
లావేరు, జనవరి 19: పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ అందించే రాష్టస్థ్రాయి ప్రతిభా పురష్కారం మండలంలో పాతకుంకాం ఫీల్డ్ అసిస్టెంట్ కె.వేణుగోపాలరావుకు దక్కింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపుదలకు ముఖ్య పాత్ర పోషించినందుకు, ఉపాధిహామీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు ఈ పురష్కారం లభించింది. ఉపాధి హామీ కింద ప్రభుత్వం కనీసం 100 రోజులు పనికల్పించగా, పాతకుంకాం ఫీల్డ్ అసిస్టెంట్ 101 రోజుల పనిదినాలు ఉపాధి హామీ కూలీలకు కల్పించి ఈ పురష్కారం అందుకున్నారు. ఇందుకుగాను కమీషనర్ రామాంజనేయులు జ్ఞాపికను ఆయనకు అందజేశారు. దీని పట్ల మండల పరిషత్ ప్రత్యేక సలహాదారుడు ముప్పిడి సురేష్, ఎంపిడివో కిరణ్‌కుమార్ , తోటన్నదొర, జడ్పిటీసీ ప్రతినిధి పిన్నింటి మధుబాబులు తదితరులు అభినందనలు తెలిపారు.