శ్రీకాకుళం

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో భాగస్వామ్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 19: స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని డి ఎం అండ్ హెచ్ వో ఎస్.తిరుపతిరావు కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు, జిల్లా పరిషత్ సి ఈవో బి.నగేష్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో గర్భస్త లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు సకాలంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. నెలవారీ నివేదికలను నిర్ణీత గడువులోగా జిల్లా కార్యాలయానికి పంపించాలని, గడువు ముగిసిన స్కానింగ్ కేంద్రాలు రెన్యూవల్ చేయించుకోవాలన్నారు. పి ఎం ఎస్ ఎం ఏ కార్యక్రమంలో భాగంగా ప్రతీ నెల 9న గర్భవతులకు పరీక్షల నిర్వహణకు స్వచ్ఛదంగా ముందుకు వచ్చి సేవలు అందించాలని డెంగ్యూ, టి.బి, ఇతర అంటువ్యాధులు సకాలంలో తెలియపరచాలని, మాక్ ఎలీసా పరీక్ష ద్వారా నిర్ధారణ కాని కేసులను డెంగ్యూ కేసులుగా పరిగణనించరాదని తెలిపారు. జెడ్పి సి ఈవో నగేష్ మాట్లాడుతూ పేసెంట్లు, సహాయకులకు వారి వారి ఇండ్లలో మరుగుదొడ్లు నిర్మించుకొని ఉపయోగించుకోవాలని ప్రభావితం చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సహాయ సహకారాలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా నిలపాలని కోరారు. లఘుచిత్రం ద్వారా మరుగుదొడ్ల ప్రాముఖ్యతను వివరించారు. ఈసమన్వయ సమావేశంలో డా.బి.సూర్యారావు, డా.అమ్మన్నాయుడు, అంబేద్కర్, డా.మందులమోహనరావు, డి ఐ వో జగన్నాధరావు, జిల్లా సమన్వయ అధికారి డా.మెండ ప్రవీణ్, జిల్లా మాస్‌మీడియా అధికారులు జి.వెంకటేశ్వర్లు, ఎం.మురళీధర్, జిల్లాలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు, వారి ప్రతినిధులు పాల్గొన్నారు.