శ్రీకాకుళం

చంద్రబాబు కాకి లెక్కలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జనవరి 20: చంద్రబాబు చూపిస్తున్న కాకిలెక్కలతో రాష్ట్రానికి ఎన్నో చిక్కులు ఏర్పడుతున్నాయని వైసీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు తమ్మినేని సీతారాం అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం 12.7శాతంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడంతో రాష్ట్రం కేంద్రనుంచి అందే ఎన్నో సంక్షేమ పథకాలకు దూరం కానుందన్నారు. తన మోసపూరిత ఎన్నికల వాగ్దానాలకు ప్రజలను బురిడీ కొట్టించిన చంద్రబాబు ఎత్తులు కేంద్ర ప్రభుత్వం వద్ద పనిచేయడం లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణాల్లో చంద్రబాబు తన సొంత మనుషులకు టెండర్లను కట్టబెట్టే ఉద్దేశ్యంతో ఎస్టిమేట్‌కాస్ట్‌లను పెంచమని కేంద్ర ఆర్థిక నిపుణులకు అందజేసినప్పటికీ వారు దానిని తిరష్కరించడం నీతిఅయోగ్ కూడా దానిని స్పష్టంచేయడం జరిగిందన్నారు. గడచిన మూడు,నాలుగురోజులుగా మీడియాలో వస్తున్న కథకాలను గమనిస్తే రాష్ట్రంలో పాలనెక్కడ ఉందనే భావన బాద కలిగిస్తుందన్నారు. తన అసహనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో అసహన పూరిత వ్యాఖ్యలు దిగజారుడు తనం చంద్రబాబు ప్రదర్శించడం సిగ్గుచేటన్నారు. ఎంతో అనుభవం గల రాజకీయ నాయకుడైన చంద్రబాబు ఇటువంటి దిగజారుడు తనాన్ని జిల్లా అధికారులపై ప్రదర్శించడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు శిమ్మ రాజశేఖర్, కె. ఎల్ ప్రసాద్, కోరాడ రమేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

జీవనోపాధి మెరుగుకు ప్రభుత్వం కృషి
నరసన్నపేట, జనవరి 20: రాష్ట్ర ప్రభుత్వం హయాంలో కొనసాగుతున్న స్వయం శక్తి మహిళ సంఘ సభ్యుల జీవనోపాధి మెరుగుకు కృషి చేయడం జరుగుతుందని ఏరియా కో ఆర్డినేటర్ రాజ్‌కుమార్ తెలిపారు. శనివారంస్థానిక వెలుగు కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ జీవనోపాధి పొందేందుకు బ్యాంకుల ద్వారా లింకేజీ రుణాలు తీసుకున్న సభ్యులకు పెరటికోళ్ల పెంపకం పథకాన్ని ఇవ్వడం జరుగుతుందని వివరించారు. దీనికి సంబంధించి 45 కోడిపిల్లలను రూ.2,810కే ఇవ్వడం జరుగుతుందని దీనిపైన ప్రభుత్వం రూ.2వేల రాయితీని ఇవ్వడం జరుగుతుందని వివరించారు. దీనికి సంబంధించి 150 యూనిట్లను మొదటి విడతగా ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. అలాగే మహిళా సంఘ సభ్యుల్లో ప్రతీ రోజూ 35మందికి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో టిపి ఎం వైకుంఠరావు, ఏపి ఎం మల్లేశ్వరరావులు పాల్గొన్నారు.