శ్రీకాకుళం

28న ఏయూ దూర విద్య ప్రవేశ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జనవరి 20: ఆంధ్రయూనివర్శిటీ దూరవిద్య డిగ్రీ ప్రవేశపరీక్షను ఈనెల 28న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎం.బాబూరావు తెలిపారు. శనివారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రాయూనివర్శిటీ ప్రతీ ఏటా జనవరి, జూన్ నెలల్లో రెండసార్లు దూరవిద్య ద్వారా డిగ్రీలో ప్రవేశానికి పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈనెల 28న నిర్వహించబోయే ప్రవేశపరీక్షకు హాజరగు అభ్యర్ధులు 2018 జనవరి 1 నాటికి 18 సంతవ్సరాలు కలిగి ఉండాలని తెలిపారు. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, బారువ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 22లోగా రూ.200 పరీక్ష ఫీజును సంబంధిత కేంద్రాల్లో చెల్లించాలని, 26వరకు అపరాదరుసుము లేకుండా ఫీజు చెల్లించే వెసులుబాటు ఉందని తెలిపారు. యూజిసి నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారు డిగ్రీలో అన్ని కోర్సుల్లోనూ జాయిన్ అవ్వవచ్చునని తెలిపారు. మూడు సంవత్సరాలపాటు డిగ్రీ కోర్సు చేసి ఉత్తీర్ణత పొందిన విద్యార్దులు ఏం ఏ , ఎం కామ్, ఎమ్మెస్సీ పోస్టుగ్రాడ్యూషన్ కోర్సులో దూర విద్య ద్వారాలేదా నేరుగా కళాశాలల్లో చేరవచ్చునని తెలిపారు. దరఖాస్తులను సంబంధిత కేంద్రాల్లో, ఏ యూ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. రిజిష్ట్రార్ ఆంధ్రాయూర్శిటీ విశాఖపట్నం వారిపేరుపై రూ.200 డి.డి ద్వారా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దూర విద్య ద్వారా ఆంధ్రాయూనివర్శిటీ, సైన్స్, ఎం బి ఏ , హెచ్ ఆర్, ఫైనాన్స్, బి యడ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులతో పాటు 45 కోర్సులను అందిస్తుందని తెలిపారు. వారాంతపు తరగతులను నిర్వహిస్తూ స్టడీమెటీరియల్‌ను అభ్యర్ధులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. గత రెండుసంవత్సరాల నుండి లెర్నర్ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా పరీక్షలకు సంబంధించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. రెగ్యులర్ విద్యార్ధులకు ధీటుగా దూర విద్య ద్వారా నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని ముఖ్యంగా మహిళలకు ఆర్థిక, తదితర కారణాల వలన చదువు ఆపేసిన వారికి, ఉద్యోగస్తులకు, బట్టల దుకాణాల్లో పనిచేసే సేల్స్‌మ్యాన్‌లకు ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
* ఈనెల 22 నుంచి బయోటెక్నాలజీపై వర్క్‌షాప్
ఈ నెల 22 నుండి 24వరకు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం.బాబూరావు తెలిపారు. కెపాసిటీ బిల్డింగ్ ఇన్ మాలిక్యూలర్ డయాగ్నోస్టిక్స్ అనే అంశంపై జాతీయ స్థాయి వర్క్‌షాప్ జరుగుతుందని 22న ఉదయం 9గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుందని, ముఖ్య అతిధిగా అంబేద్కర్ వీ.సి కూన రామ్‌జీ, గౌరవ అతిధిగా ప్రొ. ఎల్ ఎస్ శశిదర్‌లు పాల్గొంటారని తెలిపారు. బయాలజీ విద్యార్ధులు, ఫేకల్టీ మెంబర్లు వర్క్‌షాప్‌లో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఏ.యూ దూరవిద్య కోసం సీనియర్ ప్రొ.రిషీకేశ్వరరావు, కళాశాల కన్వీనర్ ఎం.ప్రదీప్, అసిస్టెంట్ కో ఆర్డినేటర్ జనార్ధననాయుడు తదితరులు పాల్గొన్నారు.