శ్రీకాకుళం

సీ ఎం చేతుల మీదుగా మున్సిపల్ చైర్సన్‌కు అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, జనవరి 20: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ్భారత్, స్వచ్ఛపర్యవేక్షణ కార్యక్రమాన్ని పట్టణంలో విజయవంతంగా అమలు చేస్తున్నందుకు స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీతసాగర్‌కు రాష్టస్థ్రాయి ప్రధమస్థానం అవార్డు లభించింది. ఈ మేరకు శనివారం అమరావతిలో సి ఎం చేతుల మీదుగా అవార్డును ఆమె అందుకున్నారు. దీంతోపాటు ఆమె ప్రాతినిద్యం వహిస్తున్న 13వ వార్డు అభివృద్ధిలో ముందంజలో ఉంచుతూ, 23వ వార్డు వెంకయ్యపేటను స్వచ్ఛగ్రామంగా తీర్చిదిద్దినందుకు ఈ అవార్డుతోపాటు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదే విధంగా మున్సిపాలిటీ పరిధిలో గల పంతులపేట మున్సిపల్ పాఠశాలను స్వచ్ఛపాఠశాలుగా గుర్తింపు పొందడంతో పాటు పలు వార్డు సమస్యలు పరిష్కారంపై నిత్యం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి చైర్‌పర్సన్ గీత చర్యలు తీసుకున్నందుకు అవార్డు లభించింది. ఇటీవల నిర్వహించిన జన్మభూమి సభల్లో రాష్టవ్య్రాప్తంగా అతితక్కువ ఫిర్యాదుల్లో వచ్చిన మున్సిపాలిటీగా రాష్టస్థ్రాయిలో గుర్తింపు పొందారు. దీనిపై పట్టణ ప్రజలతో పాటు , మున్సిపల్ మంత్రి నారాయణ, మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూనరవికుమార్, జిల్లా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు లు ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.