శ్రీకాకుళం

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జనవరి 20: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు శనివారం విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. విద్యుత్ రంగంలో జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో గత రెండు దశాబ్ధాలుగా 23వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని కార్మిక చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘనతోపాటు మానవహక్కుల ఉల్లంఘనకు విద్యుత్ రంగంలో మూడోపార్టీ కాంట్రాక్ట్ వ్యవస్థ కారణవౌతుందన్నారు. ప్రధాన డిమాండ్లపై విద్యుత్ కార్మికులు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 27 నుండి నిరవదిక సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన దశలవారీ ఆందోళన, నిరసన కార్యక్రమంలో భాగంగా భోజన విరామ సమయంలో నల్లబెడ్జీలతో నిరసన తెలుపుతున్నట్లు తెలియజేశారు. విద్యుత్‌రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ సంస్థలో విలీనం చేసి డిపార్ట్‌మెంట్ నేరుగా జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిటు డివిజన్ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, వై.రామరాజు, ఎం.గణపతిరావు, శ్రీనివాసరావు, ఎం.సురేష్, కె.మణివర్మ తదితరులు పాల్గొన్నారు.

ఎత్తిపోతల పథకాల బాధ్యత రైతులదే
జలుమూరు, జనవరి 20: గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాల నిర్వాహణ, బాధ్యత దిగువన ఉన్న రైతులదేనని ఇంజినీరింగ్ కో ఆర్డినేటర్ సూర్యనారాయణ అన్నారు. మండలం వెంకటాపురం పంచాయితీ రామచంద్రాపురం ఎత్తిపోతల పథక కమిటీ శనివారం ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతీ రైతు వాడుకున్న సాగునీరు దృష్ట్యా విధులు సమకూర్చుకుంటే మంచిగా చిరకాలం పథకాలు పనిచేస్తాయని స్పష్టంచేశారు. లిఫ్ట్ కమిటీ అధ్యక్షులు వెలమల రాజేంద్రనాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పర్యవేక్షకులు శ్రీనివాసరావు, పలువురు రైతులు పాల్గొన్నారు.