శ్రీకాకుళం

అసమర్థుల రాజకీయయాత్ర!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఐదేళ్ళు అధికారాన్ని వెలగబెట్టే టీడీపీ కేడర్ - 60 ఏళ్ళు ప్రభుత్వానికి పని చేసే ఉద్యోగుల మధ్య సంఘర్షణ నగరంలో చర్చనీయాంశమైంది. ముప్పై ఏళ్ళుగా పార్టీలో పనిచేస్తున్న నేతల మాటలే వినకపోతే ప్రభుత్వం ఉద్యోగాలు ఏలా చేస్తారంటూ చేసే సవాళ్ళు మధ్య అక్రమ కట్టడాలను కార్పొరేషన్ రీజనల్ డైరక్టర్ వై.పి.రంగనాయకులు తన సిబ్బందితో కూలదోయించారు. గత రెండు రోజులుగా నగరంలో అక్రమ కట్టడాలపై టాస్క్‌పోర్సు బృందాలు చేస్తున్న దాడుల్లో భాగంగా శనివారం ఇక్కడ రిమ్స్ ఆసుపత్రి జంక్షన్‌లో పాలకొండ రోడ్డుపై నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం అనుమతులులేకపోవడంతో కూలదోసేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో ఆ వార్డు టిడీపీ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న తమ్ముడు భవంతి కావడంతో టిడీపీ జిల్లా కమిటీలో కొంతమంది నేతలు హాజరై ఆర్డీతోపాటు, ఆయన సిబ్బందిపై తిరగబడ్డారు. ముందుగా సంవాదానికి దిగారు. అనంతరం ఘర్షణగా మారి ఎవరి బలమేమిటో తేలుస్తామన్న పరుషమైన వాదనలకు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టి మోహన్ తెరలేపారు. ఇదంతా వీడియో రికార్డింగ్, ఫోటోలు తీయిస్తున్న కార్పొరేషన్ అధికారులు నేరుగా సి.ఎం. డ్యాష్‌బోర్డుకే ఆ సంఘటనకు సంబంధించిన క్లిపింగ్‌లు ఆర్డీ పంపారు. అలాగే, స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో సిఫార్సుల కాల్స్ ఆర్డీకి చేయించినప్పటికీ, మున్సిపల్ మంత్రి నారాయణ ఆదేశాల మేరకే రాష్టమ్రంతటా టాస్క్ఫోర్సు దాడులు జరుగుతున్నాయని, అందులో భాగమేనంటూ చెబుతూ మంత్రి నారాయణతో చెప్పించమంటూ ఆర్డీ ఎమ్మెల్యేలకు సలహాఇవ్వడంతో ఆమె కాల్స్ రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం మంత్రి అచ్చెన్నకు, ఎం.పి. రామ్మోహన్‌నాయుడుకు జిల్లా టిడీపీ నేతలు ఎవరికివారు ఫోన్‌కాల్స్ చేస్తున్నప్పటికీ, వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆర్డీ, టాస్క్ఫోర్సు అధికారులు తెలుగుతమ్ముడు అక్రమ కట్టడాలను నిబంధనల మేరకు కూల్చివేయించారు. దీంతో తమ్ముళ్ళలో ఆగ్రహం కన్పించింది. అవసరానికి నాయకులు ఎవరూ ఉపయోగపడడం లేదన్న అసంతృప్తిని ఆవేశంతో వెల్లగక్కారు. అక్రమనిర్మాణానికి అడ్డుగా ఎం.పి., ఎమ్మెల్యే ఫ్లెక్సీలను వ్యూహాత్మకంగా తమ్ముళ్ళు ఏర్పాటు చేసినప్పటికీ, అధికారులు మాత్రం భేఖాతరు చేసి వారి విధులు వారు నిర్వర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా బడ్జెట్ హోటల్ ఆవరణంలో కనే్వషన్ హాల్ నిర్మాణం అక్రమంగా చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పేడాడ రమణకుమారి భవనాలపై టాస్క్ఫోర్సు బృందాలు దాడులు చేయకుండా, అదికారి పార్టీ కార్యకర్తల అక్రమ నిర్మాణాలపై దాడులు నిర్వహిస్తుంటే ఇక్కడ నేతలంతా వౌనం దాల్చడం పట్ల తమ్ముళ్ళు ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. అంతకంటే - మరింత ఆగ్రహంతో ప్రభుత్వం అధికారులు అధికార పార్టీ నేతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ...మనిషికైనా, పార్టీకైనా పౌరుషం అనేది ఉండాలి. నిష్కారణంగా మన జోలికోచ్చి..మన మంచి తనాన్ని అలుసుగా తీసుకుని..ఓపిక పట్టే కొద్ది రెచ్చిపోయి..దారుణ దురంతాలకు పాల్పడే ప్రజాప్రతినిధులపై నూరోతప్పు తర్వాతైనా కత్తికట్టి తీరాలి. ఆత్మగౌరవరం గల ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ప్రదర్శించే పౌరుషాన్ని తప్పనిసరి అయినప్పుడు కూడా కనబరచకపోతే సమాజంలో ప్రభుత్వ ఉద్యోగిపై గౌరవం ఉండదు. రాజనీతిలో మొట్టమొదటి పాఠమే ఆర్డీ రంగనాయకులు వంటపట్టించుకుని తెలుగుతమ్ముళ్ళు సవాళ్ళను ఎదుర్కొని, అక్రమ కట్టడాలను నేలకూర్చారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
శ్రీకాకుళం నగర పాలక సంస్థలో అక్రమ కట్టడాలు పెచ్చుమీరిపోవడంతో దానిపై అందిన ఫిర్యాదుల మేరకు నగరపాలక సంస్థ మంత్రి కె.నారాయణ స్పందించడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్‌ప్లానింగ్ విశాఖపట్నం కార్యాలయ అధికారులతో సంబంధిత నగరపాలక సంస్థ అధికారులు కమీషనర్లు టౌన్‌ప్లానింగ్ అధికారులతో ఏర్పాటైన ఈ టాస్క్ఫోర్స్ బృందాలు నగరంలోని పలు అక్రమ కట్టడాలపై దాడులు నిర్వహించారు. అందులో భాగంగా శనివారం నగరంలోని రిమ్స్ ఆసుపత్రి జంక్షన్‌లో గల ఒక అక్రమ కట్టడంపై దాడి చేశారు. రీజనల్ డైరెక్టర్ వై.పి రంగనాయకులు నేతృత్వంలో విశాఖకు చెందిన ఐ.వి రమణమూర్తి, శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఏ.సి.పి దేవ్‌కుమార్, టిపిఎం విజయ్‌కుమార్, నిర్మలయోచన తదితర బృందంతో ఈ దాడులు నిర్వహించారు.
అక్రమ కట్టడాన్ని కూల్చివేసాం : ఆర్డీ
అక్రమంగా నిర్మించిన మూడవ అంతస్థు భవనాన్ని టాస్క్ఫోర్సు బృందం గుర్తించి దానిని తొలగించే పనులు చేపట్టామని టౌన్‌ప్లానింగ్ ఆర్డీ రంగనాయకులు ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. సుమారు 720 చదరపు గజాల్లో ఈ భవనం నిర్మాణం చోటుచేసుకుందని దీనికి సరైన అనుమతులు లేకుండా నిర్మించడంతో తొలగించే చర్యలు చేపట్టామన్నారు. భవనాల సక్రమ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం 2016 మే నెలలో ఆన్‌లైన్ పద్దతిని ప్రారంభించిందని ఈ పద్దతి ద్వారా ప్రజలు ఇంటి వద్ద నుండే వారు నిర్మించే గృహాలకు సంబంధించి ప్లాన్‌పర్మిషన్ పొందే అవకాశం కల్పించిందన్నారు. దీనితో గృహ నిర్మాణదారులకు నగరపాలకసంస్థ కార్యాలయాలకు ప్లాన్ అనుమతి కోసం రావాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. దీనిని సాకుగా తీసుకొని కొంతమంది అక్రమార్కులు తమ ఇష్టానుసారం భవన నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. దీనిపై కొంతమేర సంబంధిత అధికారుల పర్యవేక్షణ కూడా లోపించడం వారికి మరింత ఊతమిచ్చిందన్నారు. అక్రమ కట్టడాలు, ఓ ప్లాన్‌లేకపోవడం, అనుమతి లేకపోవడం, అధిక అంతస్తుల నిర్మాణం వంటి చర్యలు చేపట్టడంతో అది ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిందన్నారు. దీనిపై దృష్టి సారించిన టౌన్‌ప్లానింగ్ శాఖ 200 చదరపు గజాలు దాటి నిర్మాణం చేపట్టిన కట్టడాలపై ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రు. నగరంలోని భనవ నిర్మాణ యజమానులు నగర పాలక సంస్థ ద్వారా గుర్తింపు పొందిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు, ఇంజినీర్లు ద్వారా మాత్రమే ప్లాన్‌లను పొంది వాటికి అనుగుణంగా నిర్మాణాలను చేపట్టాలని అందుకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను అనధికారిక భవనాలుగా గుర్తించి ప్రభుత్వ నిబంధనల మేరకు కూల్చివేయడం జరుగుతుందని టాస్క్ఫోర్స్ అధికారులు తెలియజేశారు. టాస్క్ఫోర్స్ బృందాలతో సోమ, మంగళవారాల్లో మరిన్ని అక్రమ కట్టడాలపై విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించనున్నట్లు ఆర్.డి రంగనాయకులు తెలిపారు. అక్రమకట్టడాల తొలగింపునకు భవన యజమానులు, ప్రజలు సహకరించాలని కోరారు.

వంశదార నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి
శ్రీకాకుళం(రూరల్), జనవరి 20: వంశధార నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈదీక్షలను సి పి ఎం పార్టీ జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి ప్రారంభించా. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసిత గ్రామాల్లో సుమారు 8వేల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసిందని ప్రభుత్వమే నిర్వాసితులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పెండింగ్‌లో ఉన్న యూత్‌ప్యాకేజీలను చెల్లించాలన్నారు. పునరావాస కాలనీలో స్మశాన సమస్య, మంచినీటి సమస్య తదితర వౌలిక సమస్యలు పరిష్కరించాలని కోరారు. డీ పట్టా భూములకు పిడిఎఫ్ ప్యాకేజీలు చెల్లించాలన్నారు. 5 సెంట్ల స్థలం బదుదులగా మూడు సెంట్ల స్థలం ఇచ్చారని మిగిలిన 2 సెంట్లు స్థలానికి పరిహారం చెల్లించాలన్నారు. మరణించిన నిర్వాసితుని వారసులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ దీక్షల్లో నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.సింహాచలం, గొర్లె ధర్మారావు, నాసర అప్పయ్య, యడ్ల రమణమ్మ, గొర్లె గోవిందరావు, యడ్ల లక్ష్మీ, చల్ల చల్లమ్మ, చింతాడ సాయిబుతోపాటు సుమారు 50మంది నిర్వాసితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సి పి ఎం జిల్లా కార్యవర్గసభ్యులు కె.నారాయణరావు, ఎం.తిరుపతిరావు, శిర్ల ప్రసాద్, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.