శ్రీకాకుళం

మాయలోళ్ళు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 23: ప్రతీసారీలాగే..గంటలతరబడి ప్రజాప్రతినిధులు కాలాన్ని వృధా చేసి, పురోగతిలేని ప్రగతి కోసం నిలదీసే నైజాన్ని ఇంకా మార్చుకోలేదు. జెడ్పీటీసీలు, ఎం.పి.టి.సీలు, ఎం.పి.పి.లు ప్రజాప్రరిషత్ సభ్యులంతా వారి ప్రాంతాలకు ప్రాధాన్యత వహిస్తూ అభివృద్ధి పనులపై నెలలతరబడి ఆరా తీయకుండా రెండుమూడు గంటల జెడ్పీ సర్వసభ్యసమావేశంలో అధికారులను నిలదీసే ఆనవాయితీతోనే ఈసారి కూడా జెడ్పీ జనరల్‌బాడీ సమావేశం ఆరంభమైంది. కాని - కోరం కోసం అర్థగంట సమయం మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యేలు నిరీక్షించాల్సివచ్చింది. ప్రభుత్వం ఇచ్చే రూ. వందల కోట్ల నిధులకు తగ్గట్టుగా ప్రగతి జిల్లాలో జరగడంలేదంటూ ఈ సమావేశంలో ప్రతీ సభ్యుడు అధికారులను నిలదీసాడు. పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ అయితే - ఏకంగా రోడ్లు,్భవనాలశాఖ ఇంజనీర్లను ‘మాయలోళ్ళు’ అంటూ సంభోధించారు. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు ఇంజనీర్లనైతే - వీరంతా ప్రగతిని కాగితాల్లోనే చూపిస్తారని, వాస్తవిక పరిస్థితుల్లో ఏమీ కన్పించదంటూ ఆరోపిస్తూ, 2018లో అడుగుపెట్టేసామని, ఇక ఎన్నికల సంవత్సరానికి దగ్గరలోనే ఉన్నామని ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నిధులున్నా, నిలువెత్తునా అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్టులు చెప్పిన సమయానికి పూర్తి చేయలేకపోతున్నామంటూ శివాజీ శివమెత్తారు. అలాగే, రూ.4000 కోట్లు సి.వో.టీ.గా నిల్వలు ఉండిపోతే, వాటిని వినియోగంలోకి తీసుకువచ్చేలా ఈఎన్‌సీతో మాట్లాడి ప్రతిపాదించిన రోడ్లు నిర్మాణాలకు 24 గంటల ముందే అనుమతులు తీసుకున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వివరంగా సభ్యులకు వివరించడంతో శివాజీ ఆగ్రహం తగ్గింది. ముందుగా రోడ్లు,్భవనాలశాఖను సమీక్షించిన మంత్రి అచ్చెన్న కొమనాపల్లి వంతెన నిర్మాణంలో జాప్యంపై ఆగ్రహించారు. పలాస అర్బన్ రోడ్డుల కోసం కేటాయించిన రూ. 28 కోట్లును రూ. 36 కోట్లుగా పెంచేందుకు ప్రభుత్వం నుంచి తీసుకోవల్సిన అనుమతుల ఆలస్యంపై ఎస్.ఇ.ని వివరణ కోరారు. తర్వాత ఆ శాఖ సమీక్షకాలాన్ని స్పీడ్‌బ్రేకర్స్ అంటూ సభ్యులు అరించేసారు. మార్చి నెలాఖరులోనే రోడ్ల మెంటినెన్స్ నిధులు ఎందుకు ఖర్చు చేస్తారన్న మంత్రి అచ్చెన్న ప్రశ్నకు ఆర్ అండ్ బి ఇంజనీర్లు తెల్లముఖాలు పెట్టారు. శాఖల మధ్య సమన్వయం లేక కొత్తూరు డ్రైనేజ్ పనులు నిలిచిపోయావంటూ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పేర్కొన్నారు. అలాగే, పాలకొండ నియోజకవర్గంలో రోడ్లు పనులు తెలియాలంటూ అక్కడ ఎమ్మెల్యే కళావతి కోరగా, గిరిజన ప్రాంతాలకు కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలకు వేల కోట్లు నిధులు మంజూరు చేసిందని, ఆ పనులు జరుగుతున్నాయని మంత్రి అచ్చెన్న చెప్పుకొచ్చారు. ఎన్ని రూ. కోట్లు తెచ్చిపెట్టిన రోడ్లు పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవడం వల్ల ప్రజల వద్ద ప్రతినిధులుగా మాట్లాడలేకపోతున్నామని విప్ కూన రవికుమార్ ఆర్ అండ్ బి ఇంజనీర్లపై ఆగ్రహించారు. ఇంతలో ఎమ్మెల్యే శివాజీ ‘గడ్డందీక్ష’ మళ్ళీ చేస్తానంటూ మంత్రికి, కలెక్టర్‌కు అల్టిమేటం ఇచ్చారు. రోడ్డుఎక్కకూడదంటే - గడ్డం పెంచాల్సిందేనంటూ..మందస, హరిపురం, సోంటపే - కంచిలి రోడ్డుల పనులు పురోగతికోసం హామీ ఇవ్వాలంటూ పట్టుబడితే - అచ్చెన్న వారం రోజుల్లో పనులు పురోగతిలోకి వస్తాయని హామీ ఇచ్చారు. వారం వరకూ ఓపిక పడతానని మరల గడ్డందీక్షకు దిగుతానంటూ శివాజీ హెచ్చరించారు. అనంతరం ఇరిగేషన్‌శాఖ అధికారులను సమీక్షించారు. ప్రతీ ప్రశ్నకు ఎస్.ఈ.శేషగిరిరావే జవాబుదారీగా మాట్లాడుతూ వంశధార రిజర్వాయర్ పనులు 74 శాతం, 87 ప్యాకేజీ పనులు 33 శాతం, 88 ప్యాకేజీ పనులు 54 శాతం పూర్తయినట్టు సభ్యులకు వివరించారు. మార్చి నెలాఖరునాటికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వంశధారలో 8 టి.ఎం.సి.ల నీటిని నిల్వ చేస్తామని చెప్పారు. తోటపల్లి ఆధునీకరణ కోసం సామంతుల దామోదరరావు, బొత్స వాసుదేవనాయుడు ప్రశ్నించగా, ఇంజనీర్ల నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. కరకట్టలు కోసం వైకాపా జెడ్పీటీసీలు నిలదీయగా, లిఫ్ట్‌ఇరిగేషన్ల అధ్వానపరిస్థితి కోసం ఎమ్మెల్యే కళావతి ప్రశ్నించారు. ఆఫ్‌షోర్ పనులపై జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే శివాజీ ఇంజనీర్లు అంతా మాయగాళ్ళు అంటూ అసలు ఆఫ్‌షోర్ పనులే జరగడం లేదని, రోడ్డు వేయకుండా రిజర్వాయర్ పనులు జరగవంటూ చెప్పుకొచ్చారు. ఇంజనీర్లు ప్రగతిని కాకులెక్కల్లో చూపిస్తున్నారని, వాస్తంగా పనులు పురోగతి లేదంటూ శివాజీ ధ్వజమెత్తారు. దీనికి కలెక్టర్ ధనుంజయరెడ్డి సమాధానం ఇస్తూ జూలై నాటికి శతశాతం పనులు పూర్తి అవుతుందని హామీ ఇచ్చారు. దాసుపురంలో నిర్వాసితులకు లేవుట్ వేయడం జరిగిందని, రేగులపాడు ప్రజలకు నచ్చచెప్పామని, 350 మంది నిర్వాసితులు నగదు తీసుకుంటామని ఒప్పుకున్నారని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయని, రెండు నెలల్లో రోడ్డు వేస్తామంటూ శివాజీ కోపాన్ని కలెక్టర్ తగ్గించారు. ఈ సంభాషణల మధ్య జెడ్పీ సభ్యులతో సర్వసభ్యసమావేశానికి ముందురోజునే అధికారులు ఫోన్లు చేసి మాట్లాడుతారంటూ బొత్స వాసుదేవనాయుడు అభియోగం చేసారు. నీరు - చెట్టు పనులకు అత్యవసరంగా చేపట్టాలని మంత్రి అచ్చెన్న ఆదేశించారు. పంచాయతీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ సభ్యులంతా ఏకరవుపెట్టారు. రోడ్లు వేయండి బాబోయ్! అంటూ ఇంజనీర్లను ప్రాదేయపడ్డారు. ప్రోటోకాల్‌పై సభ్యులు ఆందోళన వ్యక్తపరచగా, గ్రామసర్పంచ్ నుంచి మంత్రి వరకూ ప్రోటోకాల్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. పంచాయతీరాజ్ రోడ్లు మెంటినెన్స్‌కు ఇంజనీర్లు శ్రద్ధ వహించాలంటూ మంత్రి అచ్చెన్న ఆదేశించారు. అనంతరం మరుగుదొడ్ల నిర్మాణంలో శ్రీకాకుళం జిల్లా 12వ స్థానంలో ఉందని, నియోజకవర్గాల వారీగా నిర్మించాల్సిన నివేదికలను జెడ్పీ సీఈవో నగేష్ సమావేశంలో వివరించారు. దీంతో మంత్రి అచ్చెన్న, కలెక్టర్ స్పందిస్తూ కేవలం 67 రోజులే ముఖ్యమంత్రి ఇచ్చే లక్ష్యానికి సమయం ఉందని చెప్పారు. రోజుకు 500 మరుగుదొడ్లు నిర్మిస్తేగాని పూర్తికాదని స్పష్టం చేసారు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. పంచాయతీలకు 14వ.ఆర్థికనిధులు నిలుపుదల చేస్తామంటూ మంత్రి చెప్పగా, మరో కఠినమైన నిర్ణయాన్ని కలెక్టర్ వెల్లడిస్తూ మరుగదొడ్డి లేని వారికి ఫించన్ కట్ చేస్తానంటూ పేర్కొన్నారు. అలాగే, గిరిజనప్రాంతాల్లో 15000తోపాటు మరో 3000 అదనంగా మరుగుదొడ్డి నిర్మాణానికి ఇస్తామని, బిల్లులు ఏరోజుకారోజు చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు. అనంతరం జిల్లాలో మినీ స్టేడియంల నిర్మాణం, రైతుబజార్లకు స్థలం లేని నియోజకవర్గాలపై సమీక్ష, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవస్థల సర్దుబాటు, విద్యాశాఖ విధానాల్లో విపరీతమైన మార్పులు కావాలన్న సూచనలు ఇలా..ఈసారికి జెడ్పీ సర్వసభ్యసమావేశాన్ని ముగించారు. ఎం.పి. రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

వంశధార కల నెరవేర్చిన అధికారులకు అభినందనలు!
*రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అచ్చెన్న

శ్రీకాకుళం, జనవరి 23: వంశధార ప్రాజెక్టు కల నెరవేర్చడంతో జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డితోపాటు, ఆయనకు సహాయసహకారాలు అందించి ప్రాజెక్టు పనులు పురోగతిలో పెట్టేందుకు కృషి చేసిన వారందరికీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందనలు తెలిపారు. ఎన్నో దశాబ్ధాల నాటి కలను నెరవేర్చడంలో ఎంతో వ్యయప్రయాసలకులోనై, అవస్థలుపడి, ప్రజలచే ఛీకొట్టించుకుని, మరల వారినే చైతన్యపరిచి ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసేవారిగా మార్చిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ అభినందనలు తెలుపుతూ ఈ జెడ్పీ సర్వసభ్యసమావేశం తీర్మానించాలని అచ్చెన్న కోరారు. ముఖ్యంగా స్వచ్చ శ్రీకాకుళం కోసం మరుగుదొడ్ల నిర్మాణాల్లో వెనుకబాటుతనాన్ని తరిమికొట్టేలా మరో 67 రోజుల్లో లక్ష్యాలను పూర్తి చేయాలంటూ కోరారు. ఇప్పటికే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. సర్పంచ్‌లను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం కాదని, స్వచ్ఛశ్రీకాకుళానికి మార్గం వేసే ప్రధమపౌరులు సర్పంచ్‌లన్న ఉద్దేశ్యంతోనే వారిపై ఈ బాధ్యత నమ్మకంతో పెట్టామని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు. ఉన్నత విలువలతో, ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునేందుకు ఉద్యోగులు చేస్తున్న ప్రయత్నం స్వర్ణశ్రీకాకుళం నిర్మాణానికి పునాదులంటూ అభివర్ణించారు.