శ్రీకాకుళం

యువతతోనే రాజకీయ ప్రక్షాళన జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జనవరి 23: యువతతోనే రాజకీయ ప్రక్షాళన జరగాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ప్రజాస్వామ్య బలోపేతానికి రాజకీయ ప్రక్షాళనకు యువత ఓటు ఎంతో కీలకంగా ఉంటుందని ఆయన చెప్పారు. సిక్కోలు సైన్యం సంస్థ అధ్యక్షుడు ఎం ఎస్ గుప్త ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా స్థానిక బాపూజీ కళామందిర్‌లో యంగ్ ఓటర్స్ ఫెస్టివల్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. నగరంలోని 8 కళాశాలలకు చెందిన విద్యార్ధులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈసంరద్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలో 130కోట్లు మంది ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించే శక్తి ఓటుకే ఉందని అలాంటి ఓటును నమోదు చేయించుకోవడం, ఓటరుగా నమోదు కావడం బాధ్యతగా బావించాలన్నారు. ఏ దేశ సంపద అయినా అక్కడ ఉండే యువత ఆలోచనపై ఆధారపడి ఉంటుందని ప్రపంచమంతా భారతదేశ యువతపైనే ఆసక్తిగా చూస్తుందన్నారు. సాధారణ సర్పంచ్ ఎన్నికలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉన్న వ్యవస్థలో యువత బాధ్యత తీసుకోకపోవడం, ఓటును సక్రమంగా వినియోగించుకోకపోవడం కొంత లోపంగా ఉందని దీనిని నిర్మూలించాలంటే ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదై మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు. సిక్కోలు సైన్యం నిర్వహించిన ర్యాలీలో సూర్యమహాల్ జంక్షన్ నుండి బాపూజీ కళామందిర్ వరకు ఎన్ సిసి కేడిట్‌లతో పాటు ఎంపీ, రిజిస్ట్రార్ తులసీరావు లు జాతీయ జెండాను భుజంపై వేసుకుని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. రిటైర్డ్ సి ఇవో సురంగి మోహనరావు, చైతన్య విద్యా సంస్థల అధినేత జామి భీమశంకర్, వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ గేదెల ఇందిరప్రసాద్, రిటైర్డ్ డి ఈవో బలివాడ మల్లేశ్వరరావు, రాఘవేంద్ర ఆలయ ధర్మకర్త బరాటం కామేశ్వరరావు, ఇంటాక్ సభ్యులు వి.జగన్నాధంనాయుడు, రోటరీ అధ్యక్షులు మోహన్, సనపల పాపినాయుడు, కె.వేణుగోపాల్, లక్ష్మీపతి, జమున తదితరులు పాల్గొన్నారు.