శ్రీకాకుళం

వంశదార నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జనవరి 23: వంశదార నిర్వాసితుల పునరావాస సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20 నుండి కలెక్టరేట్ వద్ద ప్రారంభించిన రిలే నిరాహార దీక్షలు మంగళవారంతో నాల్గవ రోజుకు చేరింది. ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోయినప్పటికీ అత్యంత అనవసర ఉత్సాహంతోగ్రామాలను కూలదోసిన ప్రభుత్వ అధికారులు పునరావాసం కల్పించడంతో పిసరంతా ఉత్సాహమైన కనిపించకపోవడాన్ని సి పి ఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి తీవ్రంగా తప్పుపట్టారు. పునరావాస కాలనీల్లో కల్పించాల్సిన కనీస సౌకర్యాలు కల్పించలేదని దీక్షలో పాల్గొన్న వారు స్పష్టంచేస్తున్నారు. కేటాయించిన కాలనీల్లో నివాస స్థలాలు గోతులమయంగా ఉన్నాయని వాటిని మట్టితో కూరించాలని, తాగునీటి కొలాయిలు వేయాలని, వీధిలైట్లు వేయాలని, డీ పట్టా భూములకు నష్టపరిహారం చెల్లించాలని నిర్వాసితుల డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించాలని కోరారు. ఈ నెల 25న నిర్వాసితులందరితో సమస్యల పత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపి ఆర్ డి జిల్లా కార్యదర్శి వై.చలపతిరావు, ఎం.కనకారావు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకు అప్పన్న, నిర్వాసిత గ్రామాల యువతీ యువకులు బి.షర్మిల, బి.సరస్వతి, మధు, ఎం.సోమరాజు తదితరులు పాల్గొన్నారు.