శ్రీకాకుళం

మహాక్షీరాభిషేకం!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: శ్రీ సూర్యనారాయణస్వామి సన్నిధిలో అర్థరాత్రి దాటిన తర్వాత మంగళవాయిద్యాలు మారుమోగాయి. విశాఖపట్నం శారదాపీఠాధిపతి సద్గురు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతీ అనివెట్టి మండపం వద్ద గణపతి పూజతో రథసప్తమి పూజలు నిర్వహించి అంనతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి మూలవిరాట్‌కు మహాక్షీరాభిషేకం సేవలు ప్రారంభించారు. ‘ఓం హ్రీం ఘృణీసూర్య ఆదిత్య శ్రీమ్ మూలమంత్రంతో ఆలయం మార్మోగింది. ‘ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్’ అన్నట్టుగా ఆరోగ్య, ఐశ్వర్య ప్రదాతలుగా ఒకేసారి కనులారా వీక్షించే అరుదైన అవకాశం మాఘమాస బుధవారం పర్వదినంలో కలసిరావడంతో దర్శనశుభ సమయాన భక్తులు పరవశించిపోయారు. సమస్తలోకానికి వెలుగును ప్రసాదించే వెలుగురేడు జన్మదినం భక్తజనకోటికి పండుగగా జరుపుకునేందుకు తరలిరావడంతో అరసవల్లి భక్త ‘జన’వల్లిగా కిటకిటలాడింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆదిత్యుడు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు. భక్తులు తెచ్చిన పాలు, పంచామృతాలు, పండ్ల రసాలతో అర్చకులు స్వామికి మహాభిషేకసేవ నిర్వహించారు. క్షీరాభిషేకం..సుమధుర మనోహర దృశ్యంగా..్భక్తులకు నేత్రపర్వంగా సాగింది...తొలి సంధ్యవేళలో కర్మసాక్షి సన్నిధిలో కాలార్చనలతో ప్రారంభమైన సేవలు పంచామృతాభిషేకాలు, క్షీరాభిషేకంతో ‘ఓం హ్రీం ఘృణీసూర్య ఆదిత్య శ్రీమ్’ అంటూ మూలమంత్రంతో సిక్కోల్ మారుమ్రోగింది. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ హేలంబినామ సంవత్సరం మాఘ శుద్ధ సప్తమీ బుధవారం అరసవల్లి క్షేత్రంలో శ్రీ సూర్యనారాయణస్వామి జయంతి ఉత్సవం (రథసప్తమి) అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఇప్పిలి జోగిసన్యాసిరావు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి మూలవిరాట్‌కు మహాభిషేకం నిర్వహించారు. నిజరూప దర్శనంతో క్షీరాభిషేకాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అర్థరాత్రి నుంచే బారులు తీరారు. ముందుగా స్వామివారి సన్నిధిలో 12.15 గంటలకు సుప్రభాతసేవ, ఉషఃకాలార్చన అనంతరం శ్రీ ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణస్వామి నిజరూపదర్శనం కల్పించారు. సమస్త లోకానికి ఆరోగ్యానిచ్చే ఆదిత్యుని నిజరూపం దర్శనం తిలకించిన భక్తులు తన్మయత్వం చెందారు. సమస్త ప్రాణకోటికి తన కిరణ ప్రసారంతో ఆరోగ్యానిచ్చే శ్రీ సూర్యనారాయణస్వామి జయంతి బుధవారం ఏర్పడింది. ఎంతో అత్యంత ఆవశ్యకత లేకుండా బుధవారం రథసప్తమి ఘడియలు, ఆదిత్యుని జయంతి గడియలు కలిసిరావడం విచిత్రమైనప్పటికీ, ఈ ఏడాది శుభపరిణామం అంటూ ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ చెప్పారు. ఆదిత్యుని మహాక్షీరాభిషేకం దర్శించి ఆరోగ్యాన్ని పొందాలన్న ఆకాంక్షతో జిల్లాకు చెందిన మంత్రులు, ఎం.పి., ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, భక్తులు తరలిరావడంతో దేవాలయం అనివెట్టిమండపం అంతటా సందడి నెలకొంది. మంగళవారం అర్థరాత్రి నుంచే సప్తమి వేడుకుల్లో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి చేరుకున్న భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి, ఎస్పీ సి.ఎం.త్రివిక్రమవర్మల ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన క్యూలైన్లు, ప్రత్యేక ఏర్పాట్లు వృద్దులకు, వికలాంగులకు ఆదిత్యుని నిజరూప దర్శనం ఎంతో సులభతరమైంది! దేవస్థాన సాంప్రదాయాన్ని అనుసరించి ఆలయ సహాయ కమిషనర్ వి.శ్యామలాదేవి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

సామూహిక సూర్యనమస్కారాలు
శ్రీకాకుళం(రూరల్), జనవరి 23: తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రధసప్తమి సందర్భంగా ఈనెల 24న టిటిడి కళ్యాణ మండపం శ్రీకాకుళంలో ఉదయం 9గంటలకు వివిధ పాఠశాలల విద్యార్ధులచే సామూహిక సూర్యనమస్కారాలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్ ఎం.లలితకుమారి తెలిపారు. ఆదిత్య హృదయపారాయణం నిర్వహించబడునన్నారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులకు, భక్తులకు ఉచితంగా తీర్థప్రసాదాలను పంపిణీ చేయబడునని తెలియజేశారు.

ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు
శ్రీకాకుళం(రూరల్), జనవరి 23: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, పంచాయతీ రాజ్ శాఖామంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ జన్మదిన వేడుకలు నగర టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక ఏడురోడ్ల కూడలిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తండ్రికి మించిన తనయుడుగా నారా లోకేష్ ఎదిగారన్నారు. రూ.100తో సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు కూడా రూ.2లక్షల భీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. సీసీరోడ్లు, డ్రైనేజీలు వంటి కార్యక్రమాలు గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని రాష్ట్రంలో 50లక్షల మంది కార్యకర్తలు ఉన్నారంటే అది లోకేష్ కృషి అన్నారు. ఈ సందర్భంగా పేదలకు, వృద్దులకు హస్తకళల డైరెక్టర్ ఇప్పిలి తిరుమలరావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, సీపాన రమ, కరగాన రాము, భాస్కరరావు, విజయరామ్ తదితరులు పాల్గొన్నారు.