శ్రీకాకుళం

రాళ్లపేట వాసులకు ఉప్పునీటి అవస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, మే 8: మండలంలోని డిమత్స్యలేశం పంచాయతీ అనుబంద గ్రామమైన రాళ్లపేట గ్రామస్తులను ఉప్పునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ గ్రామంలో 350 జనాబా ఉన్నప్పటికీ రెండు బోర్లు అధికారులు నిర్మించారు. అయితే, సమీపంలో ఉన్న హేచరీ విడిచిపెట్టిన వ్యర్థాల వలన భూగర్బజలాలు పాడై ఉప్పునీరు బోరుల్లో చేరుకుంది. దీంతో మంచినీటి కోసం ఈ గ్రామస్తులు కిలోమీటర్ దూరంలో ఉన్న కొత్తదిబ్బలపాలెం గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ మంచినీటి బావి వద్ద స్నానాలు మిగిలిన అవసరాలు తీర్చుకున్నప్పటికీ తాగునీరు అందుబాటులో లేక దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఈ గ్రామస్థులు పలుమార్లు అధికారులకు ఏకరువు పెట్టుకున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టలేదని మత్య్సకారులు ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని మంజూరు చేసి మంచినీటి ఎద్దడి నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.