శ్రీకాకుళం

విద్యార్థులు ఆత్మస్థైర్యం పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరుబుజ్జిలి, ఫిబ్రవరి 20: సమాజంలో విద్యారంగాల్లో రోజురోజుకు పెరుగుతున్న పోటీతత్వాన్ని తట్టుకోవడానికి విద్యార్థులు ఆత్మస్థైర్యం పెంచుకోవాలని శ్రీకాకుళం ఇంటర్ బోర్డు విశ్రాంత రీజనల్ అధికారి పాత్రుని పాపారావు అన్నారు. మంగళవారం సరుబుజ్జిలి శ్రీ వెంకటసాయి విద్యా సంస్థలు నిర్వహించిన విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రిటైర్డ్ ఆర్ ఐ ఒ పాపారావుతో పాటు రాష్ట్ర ప్రైవేటు స్కూళ్ల సంఘ ప్రధాన కార్యదర్శి పి.రమణమూర్తి, ఎం ఇ ఒ డి.బాలరాజు, స్థానిక ఎస్ ఐ అశోక్‌బాబు ఈ సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఏడాది ప్రధాన పరీక్షలకు ముందు కళాశాలలు, పాఠశాలల్లో ఇటువంటి ఉత్సాహభరితమైన కార్యక్రమాలను నిర్వహించడం విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ముఖ్యంగా పరీక్షలకు, వివిధ రంగాల ఉద్యోగాలకు సంబంధించిన పోటీపరీక్షల్లో పాల్గొనే ముందు విద్యార్థిని విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళితే విజయానికి నాంది పలికిన వారు అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కూన జగన్నాథం, ప్రిన్సిపాల్ బి.పురుషోత్తం, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

కొఠారిపురంలో అగ్నిప్రమాదం
*రెండు పూరిళ్లు దగ్దం
రాజాం, ఫిబ్రవరి 20: రాజాం మండలం కొఠారిపురం గ్రామంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో సబ్బవరపు ఆదిలక్ష్మీ, సబ్బవరపు రమణమ్మలకు చెందిన పూరిళ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. అలాగే పంచిరెడ్డి చిన్నారావుకు సంబంధించిన పూరిళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం విస్తరించకుండా గ్రామస్తులు స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే వి ఆర్ ఒ బెవర ముకుందరావు, సర్పంచ్ అప్పలనర్సమ్మ, సర్పంచ్ ప్రతినిధి భూషణంనాయుడు, గ్రామ పెద్ద బట్న అసిరినాయుడు తదితరులు సహాయ సహకారాలు అందించారు.
-ళనఆ 20 పి ఎల్‌కె 2

మార్చి 31 నాటికి పనులు పూర్తి చేయాలి
*జిల్లా కలెక్టర్ థనుంజయరెడ్డి
భామిని, ఫిబ్రవరి 20: వంశధార కాలువ పనులు మార్చి 31 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కాట్రగడ-బి నుంచి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సైడ్ వియ్యర్‌ను పరిశీలించి మరింత వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. ఈయనతో పాటు ఆర్‌డి ఒ రెడ్డి గున్నయ్య, సి ఇ ఎం.టి.రాజు, ఎస్ ఇ ఎం.వి.శేషగిరిరావు, ఇ ఇ రామకృష్ణారెడ్డి, డి ఇలు నాగేశ్వరరావు, గోపాలకృష్ణ, ఉషారాణి, సీతారాంనాయుడు, తహశీల్దార్ సత్యం తదితరులు పాల్గొన్నారు.