శ్రీకాకుళం

నవజాత శిశువులకు ఉచిత వినికిడి చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 20: నవజాత శిశువులకు ఉచిత వినికిడి చికిత్సను అందిస్తున్నట్లు శుశృత ఆసుపత్రి ఇఎంపి వైద్యులు డా. ఎస్.కె ఇ అప్పారావు తెలిపారు. మంగళవారం రిమ్స్ హాస్పిటల్‌లో విశాఖపట్నం శుశృత ఆసుపత్రి ఇన్‌ప్లాంటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నవజాత శిశువులకు ఉచిత వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా వైద్యులు అప్పారావు మాట్లాడుతూ దేశంలో ఎక్కువగా నిర్లక్ష్యానికి గురికాబడుతున్న సమస్య వినికిడిఅని అన్నారు. వినికిడి శక్తిలేనివారు ప్రపంచంతో సంబంధాన్ని కోల్పోతారని చెవిటితనంతో పాటు మూగతనం కూడా వస్తుందని తెలిపారు. మన దేశంలో ప్రతీ ఏటా లక్షమంది పిల్లలు వినికిడిలోపంతో పుడుతున్నారన్నారు. వీటికి చికిత్స ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. 2013లో భారతప్రభుత్వం పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించడానికి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్ వెన్సన్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. పుట్టుకతో వచ్చే వినికిడి లోపాన్నిగుర్తించి అవసరమైన వారికి కాక్లియర్ శస్త్ర చికిత్స చేయించడం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్టీ ఆర్ వైద్య సేవ, ఇ హెచ్ ఎస్, ఏ డి ఐ పి డబ్ల్యూ ఐ ఎఫ్, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పూర్తిగా ఉచితంగా నిర్వహించడానికి ఆర్థిక సాయాన్ని అందిస్తుందన్నారు. గుంటూరు, విశాఖపట్నంలోకాక్లియర్ చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. శుశృత ఆసుపత్రి వైద్యులు రాజు మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు వారి సమస్యలను గుర్తించినవెంటనే చికిత్స చేయాలని తెలిపారు. అనంతరం స్పీచ్ థెరఫీని సుమారు ఒక ఏడాదిపాటు చేయించాలని తెలిపారు. తద్వారా పిల్లలకు మంచి భవిష్యత్ అందించవచ్చునని తెలిపారు. డి ఎం అండ్ హెచ్ వో ఎస్.తిరుపతిరావు మాట్లాడుతూ భారతదేశానికి మంచి ఆరోగ్యకరమైన బాలలను అందించే మంచి కార్యక్రమాలను చేపడుతున్న ఆసుపత్రి వైద్య సేవలను కొనియాడారు. ఈకార్యక్రమంలో రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సునీల్‌నాయక్, విశ్రాంత జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.సరోజినీ, వైద్యులు ప్రభాకర్, రమేష్, హెచ్.రమేష్, జగన్నాధరావు, కామేశ్వరప్రసాద్, జబర్‌కో ఆర్డినేటర్ ఎం.ప్రవీన్, ఎన్టీ ఆర్ వైద్య సిబ్బంది, రిమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

కార్మిక సంక్షేమ చట్టం అమలు చేయాలి
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 20: భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం సక్రమంగా అమలు చేయాలని కోరుతూ మంగళవారం డి సి ఎల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిటు ప్రధాన కార్యదర్శి ఎం. ఆదినారాయణమూర్తి అధ్యక్షులు ఏ.హరినారాయణ, గౌరవధ్యక్షులు మంతిన హరినాద్‌లు మాట్లాడుతూ వెల్‌ఫేర్‌బోర్డులో నమోదు చేసుకున్న కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల క్లైమ్‌లను వెంటనే పరిష్కరించాలని కోరారు. రాష్ట్రప్రభుత్వం వెల్‌ఫేర్ బోర్డు నుండి అక్రమంగా తీసుకున్న మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని కోరారు. ప్రమాద మరణం, సహజ మరణం, అంగవైకల్యాలకు సంబంధించిన క్లైమ్‌లను చంద్రన్న భీమా నుంచి కాకుండా నేరుగా బిల్డింగ్ వర్కర్స్ వెల్‌ఫేర్ బోర్డు ద్వారానే అమలు చేయాలన్నారు. ప్రమాణమారణానికి రూ.10లక్షలు, సహజ మరణానికి రూ.3లక్షలకు పెంచి బిల్డింగ్‌వర్కర్స్‌వెల్‌ఫేర్‌బోర్డు ద్వారానే అమలు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో రాజు, చినబాబు, ఎస్.అప్పారావు, శ్యామలరావు, డి.్ధనంజయరావు, ఎస్.రామారావు, ఉప్పాడ సత్యం తదితరులు పాల్గొన్నారు. అనంతరం లేబర్ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

ఘనంగా సంపత్‌వినాయక సుబ్రహ్మణ్యస్వామి విగ్రహప్రతిష్ట మహోత్సవం
పలాస, ఫిబ్రవరి 20: పలాస పోతురాజు ఎల్లమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో సంపత్‌వినాయక సహిత సుబ్రహ్మణస్వామివార్లు విగ్రహా ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇప్పిలి నర్సయ్య దంపతులకు చెందిన చిన్నారులు ఇప్పిలి షణ్ముఖరావు, సరస్వతిలు స్వర్గీస్తులు కావడంతో వారి జ్ఞాపకార్థం ఆలయాలను ఏర్పాటు చేసారు. చాంద్రమాన హేమళంబి నామ సంవత్సరం పాల్గుణశుద్దషష్టి, ఆశ్వినీ నక్షత్రం మీన లగ్నం నందు సంపత్ వినాయక సహిత సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను, యంత్రాలను ప్రతిష్ట చేసారు. విగ్రహాలు, కలశాలు, గ్రామ ప్రదక్షిణ, పుణ్యావాహచనం, జలాధివాసం, వాస్తు, యోగిని క్షేత్రపాలిక నవగ్రహ సర్వతోబాద్రా మండప ఆరాధనలు, అగ్ని ప్రతిష్ట, ప్రధాన దేవతల ఆవాహనం కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితులు అనిల్‌శర్మ, రామప్రసాద్‌శర్మ, గరిమెళ్ల వెంకటరామనుజ్ఞలు, నగరంపల్లి మురళీకృష్ణ, శ్రీశైలశర్మ, మనీల్‌కుమార్‌ల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఇప్పిలి నర్సయ్య, జగ్గయ్య దంపతులు పూజలు నిర్వహించారు.