శ్రీకాకుళం

వినియోగదారుల సేవలే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 20: వినియోగదారుడుకు ఉత్తమ సేవలు అందించడమే తమలక్ష్యమని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఇ.రతన్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం స్థానిక న్యూ కాలనీకి తరలించబడిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్‌ని ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత బ్రాంచ్‌లో కొన్ని అసౌకర్యాలు ఉండటం గుర్తించడం జరిగిందని అందుకే కొత్తగా తరలించబడిన ఈ బ్రాంచ్‌లో నూతన, సాంకేతిక, పరిజ్ఞానంతో కూడిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈబ్యాంకు జిల్లాలో తొలిసారిగా 2007లో స్థాపించామని ప్రస్తుతం నాలుగు బ్రాంచ్‌లు నగరంలో పనిచేస్తున్నాయన్నారు. త్వరలో మరిన్ని బ్రాంచ్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రప్రధమంగా 1917లో స్థాపించడం జరిగిందని వందేళ్ల సుదీర్ఘచరిత్ర కలిగి దేశవ్యాప్తంగా కొనసాగడం ఈ బ్యాంకు సొంతమన్నారు. ఇతర బ్యాంకులతో పోల్చితే ప్రతీ సేవలోనూ బ్యాంకు ప్రత్యేకత సంతరించుకుందని స్వల్ప వ్యవధిలో రుణాలను మంజూరు చేయడం అన్ని రకాల రుణాలను ఒకేచోట మంజూరు చేయడం విశేషమన్నారు. అంతేకాకుండా తీసుకున్న రుణాలపై స్వల్ప వడ్డీవంటివి ఈ బ్యాంకు ప్రత్యేకంగా అభివర్ణించారు. రాష్టవ్య్రాప్తంగా 132 బ్రాంచ్‌లు పనిచేస్తున్నాయని 7500కోట్ల రూపాయల లావాదేవీలతో బ్యాంకు పనిచేస్తుందని ఈ సందర్భంగా సిబ్బందిని అభినందించారు. బ్రాంచ్ విషయానికొస్తే మంచి సిబ్బంది ఇందులో పనిచేస్తున్నారని వారి కృషితో బ్రాంచ్‌లను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. తొలుత జ్యోతిప్రజ్వలన చేసి బ్రాంచ్ లావాదేవీలను ప్రారంభించారు.ప్రాంతీయ జనరల్ మేనేజర్ వినోద్ ప్రొప్లే మాట్లాడుతూ విద్యా,వ్యాపార ,ట్రేడింగ్ పరంగా జిల్లాకు మంచి పేరుందన్నారు. రూ.5కోట్ల వరకు రుణం మంజూరు చేసే అధికారం తమకు ఉందని వీటిని ప్రతీ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బంగారం, గృహ రుణాలు, విద్యుత్ సంబంధించిన రుణాలను సత్వరమే తీసుకువచ్చునని తెలిపారు. వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యంకలుగకుండా ఉత్తమ సేవలు అందించడమే తమ బ్యాంకు లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం బ్యాంకు అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ బిస్వాల్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.