శ్రీకాకుళం

ఓడీఎఫ్‌పై నిర్లక్ష్యం....!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: బౌగోళికంగా రాష్ట్రానికి శివారుగా ఉన్న శ్రీకాకుళం జిల్లా ఓ డి ఎఫ్ లక్ష్య సాధనలో వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా నిలవడం ఇచ్ఛాపురం జన్మభూమి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్చిమాసాంతానికి అందరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని పిలుపునిచ్చిన విసయం తెలిసిందే. ఓ డి ఎఫ్ లక్ష్యాలు అధిగమించకుంటే జిల్లాకు వచ్చి కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తానని సిఎం బాబు వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం అల్టీమేటం ఇచ్చారు. అయితే జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం లేకపోవడం వలన మరుగుదొడ్లు గ్రామాల్లో నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదని అపవాద కూడా వినిపిస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఓ డి ఎఫ్‌పై ఎంతో శ్రద్ధ చూపినా అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపిటీసీలు జన్మభూమి కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలు ఈ నిర్మాణాలపై కనె్నత్తి చూడకపోవడంతో అధికారుల అవగాహన స్థానికులు గాలికి వదిలేస్తున్నారు. మోదీ ప్రభుత్వం 2014 అక్టోబర్ 2 గాంధీజయంతిని పురష్కరించుకుని స్వచ్ఛ్భారత్‌లో భాగంగా ఓ డి ఎఫ్ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రతీ ఇంటా మరుగుదొడ్డినిర్మాణం జరగాలని, అన్ని గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన నియంత్రించాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిని రాష్ట్రప్రభుత్వం మరింత ప్రతిష్టాత్మకంగా చేపట్టి జిల్లాలో 3,65,000మరుగుదొడ్లు నిర్మాణాలకు మంజూరు చేసింది. వీటిని నిర్మించాలని ఉపాధి హామీ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను భాగస్వామ్యులను చేసింది. ప్రణాళిక అమలులో శాఖల మధ్య సమన్వయలోపం సుస్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలు బలంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో వెలుగు విభాగం సిబ్బంది వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలపై అవగాహన కల్పించడంలోనూ, ఓడిఎఫ్ లక్ష్యాలు అధిగమించడంలోనూ భాగస్వామ్యులు కావడం లేదని పలు శాఖల అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు కూడా అంటీముట్టని చందంగా వ్యవహరిస్తున్నారని నిర్మాణాలే సుస్పష్టంచేస్తున్నాయి. ఓ వైపు గడువు ముంచుకొస్తున్నప్పటికీ ఇప్పటికీ 1,23,364మాత్రమే పూర్తయినట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. 57వేలు నిర్మాణాల్లో ఉన్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. వీటిని పరిశీలిస్తే 57 శాతం మాత్రమే ఇప్పటివరకు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. మిగిలిన 1.84లక్షల మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభం కావాల్సి ఉంది. వీటిని అధిగమించేందుకు జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి తన స్థాయిలో అనునిత్యం శ్రమిస్తున్నప్పటికీ పలు శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగకపోవడం వలనే వీటి లక్ష్యాలు నత్తనడకన సాగుతున్నాయని అధికారవర్గాలే చర్చించుకుంటున్నాయి. విద్యా సంస్థలను ఓ డి ఎఫ్ లక్ష్యాలు అధిగమించేందుకు భాగస్వామ్యులను చేయడం వలన అంబేద్కర్ విశ్వవిద్యాలయంతోపాటు అన్ని యూజీ, పీజీ కళాశాలల విద్యార్ధులు గ్రామాలబాట పట్టి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల ఆవశ్యకతను చాటిచెప్పడంతో కొంతపురోగతి సాధించగలిగారు. మరుగుదొడ్ల లక్ష్యాలకు పంచాయతీ నిధులపై ఫీజింగ్ విధించిన ప్రధమ పౌరులలో చలనం కరువైందనే చెప్పాలి. ఇదిలా ఉండగా మరుగుదొడ్డి కట్టని కుటుంబానికి రేషన్, ఫించన్ రద్దు చేస్తామని అధికారులు సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు నడుం బిగిస్తున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు ఇటు డీలర్లు, అటు పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి పెంచి ఓటు బ్యాంకు ఇబ్బంది కలుగుతుందని సాకులు చెబుతూ వాటిని కూడా అడ్డుకోవడం వల్ల ఓ డి ఎఫ్ ఆమడదూరంగా ఉందనే చెప్పాలి.