శ్రీకాకుళం

‘పది’పరీక్షలకు 59 మంది గైర్హాజరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (రూరల్), మార్చి 16: పదోతరగతి పరీక్షలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 37,789 మంది విద్యార్థినీవిద్యార్ధులు హాజరుకావల్సివుండగా, 37,730 మంది శుక్రవారం తెలుగు-2, సంస్కృతం పరీక్షలకు హాజరయ్యారు. రెండోరోజు పరీక్షకు 59 మంది గైర్హాజరు అయినట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. నగరంలో పాత హౌసింగ్ బోర్డు కాలనీలో గల సిద్ధార్థ హైస్కూల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పరీక్షా కేంద్రంలో నిర్వాహణాతీరును పరిశీలించి ఇనే్వజరేటర్లను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రంలో వసతులుపై అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు వ్రాసే విద్యార్ధులకు సిటింగ్ ఏర్పాట్లు, తాగునీరు వెళుతురు తదితర ఏర్పాట్లును పరిశీలించారు. విద్యార్ధులు పరీక్షలు రాసేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో పరీక్ష ఏర్పాట్లును పూర్తి స్థాయిలో చేపట్టాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాలకు చేరుకునే విద్యార్ధులకు సకాలంలో బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులకు ఆదేశించామన్నారు. పరీక్షా కేంద్రాలు వద్ద 144సెక్షన్ విధించడం జరిగిందన్నారు. ఎటు వంటి వత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసి విజయవంతం కావాలన్నారు. విద్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా మంచినీటి సదుపాయం, మెడికల్ కిట్‌ను కూడా ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. అలాగే, జిల్లా విద్యాశాఖాధికారి సాయిరాం నాలుగు కేంద్రాలను పరిశీలించారు. ఫ్లైయింగ్ స్క్వేడ్ 60 కేంద్రాల్లోనూ, జిల్లా స్థాయి ప్రత్యేక పరిశీలకులు ఐదు కేంద్రాలను తనిఖీలు నిర్వహించారు. పదో తరగతి రెండోరోజున జరిగిన పరీక్షలో ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ జరగలేదంటూ విద్యాశాఖ అధికారులు చెప్పారు.