శ్రీకాకుళం

ఆ గ్రామానికి చెలమ నీరే గతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, మార్చి 20: మండల కేంద్రానికి అరకిలోమీటరు దూరంలో ఉన్న ఆ గ్రామానికి చెలమనీరే గతి అవుతుందని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రం కొత్తూరుకు కూత వేటు దూరంలో ఉన్న మైదాన ప్రాంత గ్రామమైన కర్లెమ్మలో మంచినీటికి మహిళలు కటకటలాడుతున్నారు. బిందెడు నీరు తాగేందుకు కావాలంటే గగనమే అవుతుందని మహిళలు చెబుతున్నారు. మంచినీటి సదుపాయం కల్పించాలని పంచాయతీ పాలకులకు, మండల పరిషత్ అధికారులతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేకు కూడా పలుమార్లు విన్నవించినాపట్టించుకొనే వారు కరువయ్యారని కర్లెమ్మవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి మండల కేంద్రం సమీపంలో ఉన్న కర్లెమ్మ గ్రామానికి పంచాయతీపరంగా ప్రతి ఏడాది లక్షలాది రూపాయలు వివిధ రూపాల్లో ఆదాయం వస్తున్నా అభివృద్ధి మాత్రం కించెత్తు కూడా కనిపించడం లేదు. మండల కేంద్రం పంచాయతీ కొత్తూరుతో సమానంగా అటు ఆదాయంలోనూ, ఇటు ప్రభుత్వం మంజూరు చేసే నిధుల్లోనూ అత్యధిక మొత్తంలో చేరుతున్నప్పటికీ కనీసం మంచినీటి సదుపాయానికి కూడా గ్రామంలో అధికారులు, పాలకులు చర్యలు తీసుకొనే దాఖలాలు లేకపోవడంతో వేసవి రాకముందే గ్రామంలో తీవ్రమైన మంచినీటి ఎద్దడి నెలకొంది. గ్రామ సమీపం నుంచి ప్రవహిస్తున్న హడ్డుబంగి గెడ్డ ఈ గ్రామానికి ప్రధాన మంచినీటి వనరు. అయినప్పటికీ ఈ గెడ్డ పూర్తిగా వేసవికి ముందే ఎండిపోవడంతో గెడ్డ మధ్యలో చిన్న గోతిని తీసి ఆ గోతిలోంచి ఊరే చెలమ నీరును ఆ గ్రామ మహిళలు నిత్యం దాహార్తిని తీర్చుకొనేందుకు వ్యయప్రయాసలు పడుతుండడం నిత్యకృత్యమైంది. ఇటువంటి బాధలను ఎదుర్కొంటూ గ్రామ పెద్దలైన సర్పంచ్, మండల పరిషత్ పాలకులు, అధికారులకు తమ గ్రామానికి మంచినీటిబోర్లు తవ్వించాలని ఎన్నోసార్లు గ్రామానికి వచ్చిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉన్న మంచినీటి బోర్లు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో పాటు మండలానికి ఐదేళ్ల క్రితం నిర్మించిన మెగా రక్షిత మంచినీటి పథకం పైపులైన్లు కూడా వేయకపోవడంతో బిందెడు మంచినీటి కోసం రాత్రి, పగలు తేడా లేకుండా వ్యయప్రయాసలు అక్కడి మహిళలు ఎదుర్కొంటున్నారు. హడ్డుబంగి గెడ్డలో తవ్విన చెలమ నీరు వద్ద దుర్గంధభరితం పరిస్థితి ఉన్నప్పటికికూడా మహిళలు ముక్కుమూసుకొని బిందెలతో గంటల తరబడి నీళ్లను తోడుకోని వస్తూ ఉంటారు. ఇది చూస్తున్న స్థానిక పాలకులకు కూడా కనీసం కనికరం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు, పాలకులు స్పందించి కర్లెమ్మ పంచాయతీ కేంద్రానికి మంచినీటి వనరులను ఏర్పాటు చేయాలని మహిళలు కోరుతున్నారు.

చిన్నారి మృతిపై సమగ్ర దర్యాప్తు
కొత్తూరు, మార్చి 20: మండలం ఆర్ అండ్ ఆర్ పునరావాస కాలనీలో చిన్నారి కరుణను తండ్రి సింహాచలం కడతేర్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై స్థానిక సి ఐ జె.శ్రీనివాసరావు ఆర్ ఆర్ కాలనీకి వెళ్లి చిన్నారి తల్లి అన్నపూర్ణను సమగ్ర విచారణ చేశారు. ఈ సంఘటనకు దారి తీసిన కారణాలను తల్లి అన్నపూర్ణ వద్ద నుంచి అడిగి తెలుసుకొని వాంగూల్మాలను నమోదు చేశారు. సింహాచలం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు అనంతరం నిందితుడు సింహాచలాన్ని అరెస్టు చేయనున్నట్టు సి ఐ తెలిపారు. ఆయన వెంట వి ఆర్ ఒ రమేష్, వి ఆర్ ఎ రామారావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

సహకార సంఘాల ద్వారా రుణాలు మంజూరు
పలాస, మార్చి 20:ప్రాథమిక సహకార సంఘాల ద్వారా అన్ని రకాల రుణాల మంజూరు చేయడం జరుగుతుందని పలాస పిఎసిఎస్ అధ్యక్షులు దువ్వాడ శ్రీ్ధర్ అన్నారు. బమ్మిడి సరస్వతికి లక్ష రూపాయలు రుణం మంజూరు చేసి పలాస పిఎసిఎస్ కార్యాలయంలో చెక్కును పిఎసిఎస్ అధ్యక్షులు దువ్వాడ శ్రీ్ధర్ సరస్వతికి అందించారు. ఈ సందర్భంగా శ్రీ్ధర్ మాట్లాడుతూ రైతులకు, వ్యాపారులకు అన్ని వర్గాల వారికి వివిధ రకాల రుణాలు మంజూరు చేయడంతో డిసిసిబి, పిఎసిఎస్‌లు ముందుంటాయన్నారు. అన్ని వర్గాల వారు రుణాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సి ఇవో టి.శ్రీనివాసరావు, పి.వైకుంఠరావు, పైల చిట్టి, ఎం.్ధనరాజ్, నవీన్, వినోద్, కామేశ్వరరావు, శ్రీనివాస్, విజయకుమార్, ఎస్.గోపి తదితరులు పాల్గొన్నారు.

అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు
పలాస, మార్చి 20: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు బమ్మిడి ఆనందరావు అన్నారు. ఉపాధి హామీ పథకం కూలీల డిమాండ్‌ల సాధనకై విజయవాడలో జరగనున్న ధర్నాకు బయలుదేరిన ఆనందరావును, వజ్రపుకొత్తూరు మండల కార్యదర్శి భాస్కరరావులకు పలాస రైల్వేస్టేషన్‌లో కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు 445 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన 730 కోట్ల రూపాయలు ఉపాధి నిధులు కాజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఉపాధి పథకం ద్వారా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఉపాధి పనుల్లో ఎవరైనా మరణిస్తే 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఉపాధి కూలీల సమస్యలను పరిష్కారించాలని లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామన్నారుర.