శ్రీకాకుళం

రాజకీయ అనుభవంతో ఏపీ అభివృద్ది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), మార్చి 20: 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితం ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం, రాష్ట్భ్రావృద్ధి కోసం ఉపయోగించారనే విషయం ప్రజలందరికీ తెలుసునని మాజీ మంత్రిగుండ అప్పలసూర్యనారాయణ తెలిపారు. తన నివాస గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీ ఆర్ నాయకత్వంలోనే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోనికి వచ్చినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలతో పాటు పేదవారికి పక్కా గృహాలుగా మారిన విధానంతో చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంఅభివృద్ధితో ముందుకుపోయే సందర్భంలో ఏపీ విభజన జరిగిన తరువాత ఆంధ్రుల ఆత్మాభిమానం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో నిరంతరం పనిచేస్తున్నారని తెలియజేశారు. వైసీపీ నాయకులు ఆయనను స్వార్ధపరుగులు అభివర్ణించి మాట్లాడటం బాదాకరమన్నారు. వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నట్లు భావిస్తున్నామన్నారు. చంద్రబాబు జాతీయ నాయకులని గతంలో భారతదేశ ప్రధానీగా స్థానాన్ని ఇస్తామన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లలేదని ప్రస్తుత సందర్భంలో కూడా జాతీయ రాజకీయాలు చేయనని, రాష్ట్రం కోసమే పనిచేస్తానని చెప్పడం ఏపీ ప్రజానీకం పట్ల చంద్రబాబుకు ఉన్న ప్రేమాభిమానాలు అర్థవౌతున్నాయన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, కరగాన రాము, పాండ్రంకి శంకర్, ప్రధాన విజయరామ్, చిట్టి నాగభూషణం, రోణంకి మల్లేశ్వరరావు, పొట్నూరు కృష్ణమూర్తి, కరగాన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు ప్రతిపాదనలు
రాజాం, మార్చి 20: జిల్లాలో విస్తారంగా పండుతున్న మొక్కజొన్నను కొనుగోలు చేసే ప్రతిపాదన ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ చక్రధర్‌బాబు తెలిపారు. మంగళవారం రాజాం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. రబీ సీజన్‌లో ప్రభుత్వం అందించిన సహకారం వల్ల మొక్కజొన్న దిగుబడి అధికంగా పెరిగిందని, అలాగే రానున్న ఖరీఫ్ సీజన్‌లో కూడా మొక్కజొన్న విస్తీర్ణం పెరుగుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ప్రతిపాదనలు సిద్దం చేసినట్టు తెలిపారు. అలాగే బియ్యం నిల్వా కేంద్రాలను జిల్లాలో కుదించే యోచన ఉందని, రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరిలో 16 కేంద్రాలుండగా, మన జిల్లాలో మాత్రం 29 ఉన్నాయని, అద్దె, సిబ్బంది కొరత వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ కేంద్రాలను కుదిస్తామని ఆయన తెలిపారు. ఈ ఏడాది రైతులకు మద్దతు ధర బాగానే కలిసి వచ్చిందని, ధాన్యం దిగుబడులు బాగా రావడంతో లెవీ లక్ష్యాలు కూడా అనుకున్న స్థాయిలో సాధించామన్నారు. అంతకుముందు ఆయన తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. అలాగే కార్యాలయం రికార్డులను పరిశీలించిన అనంతరం సిబ్బంది పనితీరును కూడా అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు తహశీల్దార్ వై.శ్రీనివాసరావు, డిటి కృష్ణమూర్తి,సిబ్బంది ఉన్నారు.

టీడీపీ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు
పలాస, మార్చి 20:ప్రత్యేక హోదా కోసం వైసీపీ పార్టీ పోరాటం చేయడంతో టీడీపీ పార్టీ యుటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా రాగం ఎత్తిందని వైసీపీ నాయకులు దువ్వాడ శ్రీకాంత్, రాజాశ్రీకాంత్, ఉంగ సాయికృష్ణ, సన్యాసి ఆప్టోలు ధ్వజమెత్తారు. మంగళవారం పలాస వైసీపీ పార్టీ కార్యాలయంలో వారు విలేఖరులతో మాట్లాడుతూ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాటం చేస్తుండగా, అప్పట్లో ప్రత్యేక హోదా ఎందుకు అని, అందుకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకుందామని, అదే సంజీవని అన్న పెద్దమనిషి నేడు ప్రజలు నుంచి వస్తున్న స్పందన చూసి ప్రత్యేక హోదా రాగం ఎత్తారన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీషా హరీష్ మృతికి కారణమైన పైల చక్రధర్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారని, అప్పట్లో చక్రధర్‌ను సస్పెండ్ చేయాలని ఎవ్వరూ అడగలేదన్నారు. అటువంటి టీడీపీ నాయకులు సాక్షాత్తూ టీడీపీ అధ్యక్షురాలు భర్త వెంకన్నచౌదరి కౌన్సిలరు పైల చక్రధర్‌ను వెనుకువేసుకొని రావడంలో అంతర్యమేమిటి అని, తెర వెనుక ఇంకా ఎంత పన్నాగం పన్నుతున్నారో అర్థం అవుతుందన్నారు. టీడీపీ నాయకులు శిరీషా వైశ్యులకు బేషరతు క్షమాపణలు చెప్పి, హరీష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు డబ్బీరు భవానీ, పులిరాజు, అంబటి ఆనంద్, దున్న సత్యం, గౌరుత్యాడి, సోమేశ్వరరావు, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.