శ్రీకాకుళం

ఎమ్మెల్యేపై అపోహలు సృష్టించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), మార్చి 21: మహిళా సంఘాలను మోసం చేస్తున్న ఎమ్మెల్యే అని వైసీపీ నాయకురాలు ఎం.వి పద్మావతి విమర్శించడం ఉద్దేశ్యపూర్వకంగా అపోహలు సృష్టించడమేనని ఇది వారికి అలవాటుగా మారిందని తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేతలు పేర్కొన్నారు. ఎమ్మెల్యే నివాస గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ఏ సంఘటనలైనా ఎమ్మెల్యేపై నిందలు మోపుతూ మాట్లాడటం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. అంగన్వాడీ వర్కర్లకు, పోలీసులకు మధ్య జరిగిన వివాదాన్ని కూడా ఎమ్మెల్యే లక్ష్మీదేవిపై ఆడిపోసుకోవడం సంస్కారహీనమన్నారు. గతంలో అసత్యప్రచారాలకు పూనుకుని ఎగ్జిబిషన్ విషయంలో, బడ్జెట్‌హోటల్ విషయంలో, ఇసుక విషయంలో మాట్లాడితే ప్రజల మధ్య వాస్తవాలను తెలిపేందుకు బహిరంగ చర్చకు దిగితే ముందుకురాని సందర్భాలు కూడా ప్రజలకు తెలుసునన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు చెప్పే సంస్కృతి నేర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం సభ్యులు, మాజీ కౌన్సిలర్లు తెలియజేశారు. ఎమ్మెల్యే లక్ష్మీదేవి ప్రజలు తెలుగుదేశం పార్టీ మహిళా అభ్యర్థిగా శాసనసభకు అవకాశం ఇస్తే రాష్ట్రంలోనే నెం.1 ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న విషయం ప్రలందరికీ తెలుసునని ఇదే విధంగా గతంలో శ్రీకాకుళం మున్సిపాలిటీకి చైర్‌పర్సన్ అవకాశం ఇస్తే వీరు చేసిన అవినీతి తట్టుకోలేక సొంత పార్టీ కౌన్సిలర్లే వీధుల్లోకి ఎక్కి శ్రీకాకుళం మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద టెంటు వేసి ధర్నాలు చేసిన సందర్భం ప్రజలు మర్చిపోలేదన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ఎన్టీ ఆర్ మహిళలకు ఆస్థిహక్కు కల్పిస్తే మహిళలు సామాజికంగా, ఆర్ధికంగా చైతన్యవంతులు కావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో మొట్టమొదట డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది చంద్రబాబునాయుడే అన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే మూడు విడతల్లో రుణమాఫీ చేయడం జరిగిందని ఒక్క శ్రీకాకుళం నగరంలోని 1378 డ్వాక్రా సంఘాలకు రూ.12.01 కోట్లు రుణమాఫీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ ఆర్.త్రిలోచన, కె.కమల, పి.కవిత, కె.సుశీల, పి.మాధవి, కళావతి, అసిరమ్మ, సీపాన రమ, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల మంజూరులో టీడీపీ వైఫల్యం
శ్రీకాకుళం(రూరల్),మార్చి 21: బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌యోజన పథకం ద్వారా పట్టణ పేదలకు రూ.1.50 సబ్సీడీతో ఇస్తున్న ఇళ్లను లబ్ధ్ధిరులకు కేటాయించడంలో ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు వైఫల్యం చెందారని బీజేపీ నగర అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు ఆరోపించారు. మొదటి విడతగా 1280మాత్రమే ఇప్పటివరకు నిర్మాణంలో ఉన్నాయని రెండవ విడత 3104 కేటాయించినా ఇంతవరకు వాటిని మొదలు పెట్టలేదని ఈ కారణంగా 3వ విడత ఇళ్లు నగరానికి మంజూరు కాలేదన్నారు. ఇప్పటివరకు 7500మంది లబ్ధిదారులు ఉంటే కేవలం 1280 ఇళ్లు మాత్రమే మొదలుపెట్టారని మిగిలినవారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన 13 జిల్లాలకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం 2లక్షల ఇళ్లు పట్టణ పేదలకు ఇస్తే జిల్లాకు 4384 మాత్రమే వచ్చాయంటే మన వాటా ఎంతో లెక్కవేయాలన్నారు. జిల్లా, నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవపడానికి కారణం ప్రజాప్రతినిధులు అలసత్వమేనని పేర్కొన్నారు. ఇప్పటికైనా రెండవ విడత ఇళ్లను వెంటనే మొదలుపెట్టాలని కోరారు.