శ్రీకాకుళం

ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ (టౌన్), మార్చి 23: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సూచించారు. శుక్రవారం నగర పంచాయతీ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో 80 మంది శిక్షణ పొందిన వారికి కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్ని విధాలా అభివృద్ధి చెందితే ఆ కుటుంబాలు బలోపేతం అవుతాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ శిక్షణ పొందిన మహిళలందరికీ ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. సక్రమంగా వీటిని వినియోగించుకొని అభివృద్ధి చెందాలన్నారు. నగర పంచాయతీ పరిధిలోని అన్ని వార్డుల మహిళలు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగర పంచాయతీ చైర్‌పర్సన్ పల్లా విజయనిర్మల మాట్లాడుతూ లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలకు మహిళలు సద్వినియోగం చేసుకున్ననాడే ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా అడ్మినిస్ట్రేటివ్ అధికారి అరుణకుమారి, నగర పంచాయతీ కమిషనర్ బాలాజీప్రసాద్, కౌన్సిలర్లు, టిడిపి పట్టణ అధ్యక్షులు గంటా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

కృషి విజ్ఞాన కేంద్రం కోసం స్థల పరిశీలన
పలాస, మార్చి 23:రామకృష్ణాపురంలోని ప్రభుత్వం సేకరించిన భూముల్లో ఆచార్య ఎన్‌జి రంగా ఆగ్రికల్చరర్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో కృషివిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఆ యూనివర్శిటీ ఉత్తరాంధ్ర రీజనల్ డైరెక్టర్ ప్రోఫెసర్ కృష్ణప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధంగా కృషివిజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు అనుకూలమా, కాదా అనేది పరిశీలించామన్నారు. ఈ ప్రాంతంలో కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని సంతృప్తి వ్యక్తం చేసారు. ఈయనతోపాటు ఆర్ ఐ శ్రావణ్, సర్వేయర్ చలపతిరావు తదితరులున్నారు.

స్వాతంత్య్ర పోరాటంలో భగత్‌సింగ్‌కు ప్రత్యేకస్థానం
పలాస, మార్చి 23:స్వాతంత్య్ర పోరాటంలో భగత్‌సింగ్‌ది ప్రత్యేక స్థానమని పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అన్నారు. పద్మనాభపురం పాఠశాలలో భగత్‌సింగ్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో భగత్‌సింగ్ తనదైన శైలిలో పోరాటం చేసి బ్రిటిషువారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారన్నారు. భారతదేశాన్ని ఆంగ్లేయుల దాస్యశృంఖాల నుంచి విముక్తి చేయడానికి ఆయన చేసిన పోరాటం ఎంతగానో దోహదపడిందని, ఆయన కీర్తి చిరస్థాయిలో నిలిచిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎల్.వి.చలం, పులిరాజు, బల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.