శ్రీకాకుళం

జాతీయ అక్షరాస్యత పరీక్షకు 526మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, మార్చి 23: మండలంలో 526మంది వయోజన నూతన అక్షరాస్యులకు ఆదివారం జాతీయ అక్షరాస్యత పరీక్షను క్రమపద్ధతిలో నిర్వహించాలని ఎంపీడీవో జగదీశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సాక్షరభారతి సమన్వయ కర్తలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా మండల సమన్వయ కర్త వెలమల విజయలక్ష్మీ మాట్లాడుతూ ఉదయం 10 నుండి సాయంత్రం 5గంటల వరకు నిర్ణయించిన 30 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు, వెలుగు సిబ్బంది, క్షేత్ర సహాయకులు పర్యవేక్షకులుగా నిర్ణయిస్తారని తెలియజేశారు. గడచిన 11 గంటల్లో నిర్వహించిన పరీక్షలలో సి గ్రేడ్ పొందిన వారు పరీక్షకు హాజరు కాని వారు ఇప్పటివరకు పరీక్ష రాయని వారిని ఆదివారం ఎంపిక చేసిన కేంద్రాలలో పరీక్షలు రాయించాలని సూచించారు. ఈ సందర్భంగా పరీక్షలకు సంబంధించిన గోడపత్రికను ఎంపీడీవో ఆవిష్కరించారు. ఇదే సమావేశంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సాక్షరభారతి సమన్వయ కర్తలు ఎంపీడీవో జగదీశ్వరరావుకు వినతిపత్రాన్ని సమర్పించారు.

రైతురధం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ శత్రుచర్ల
పాతపట్నం, మార్చి 23: పాతపట్నంలో శుక్రవారం శ్రీకాకుళం ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు రైతురధ ట్రాక్టర్లు ప్రారంభించారు. ఎమ్మెల్సీ కోటాపై మంజూరయ్యాయని వీటిని ఈ సందర్భంగా ప్రారంభించినట్లు తెలిపారు. పాతపట్నం మండలానికి చెందిన ఏనుగులతల సూర్యం, తూలుగు సీతారాం, ఎల్ ఎన్ పేట మండలంకు చెందిన యనమల కృష్ణారావు, మెళియాపుట్టి మండలానికి చెందిన రైతులు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆధునిక పద్దతిలో వ్యవసాయ విధానాన్ని అందించే దిశగా మరింత రైతుల సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొంచాడ వీరభద్రరావు, ఏవో ఎల్.వి మధు, ఎంపీటీసీ ప్రతినిధి సవిరిగాన ప్రదీప్, కేలం కామేశ్వరరావు, ఎస్.జోగారావు తదితరులు ఉన్నారు.

ప్రత్యేక హోదాపై న్యాయవాదుల ధర్నా
నరసన్నపేట, మార్చి 23: మండల కేంద్రంలోని స్థానిక న్యాయస్థానానికి సంబంధించిన న్యాయవాదులు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై నినదించారు. శుక్రవారం ప్రధాన రహదారిపై స్థానిక కంబకాయ కూడలి వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇప్పిలి తాతబాబు మాట్లాడుతూ ప్రత్యేకహోదాపై కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని, రాష్ట్రానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదాను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయవాదుల సంఘ ఆదేశాల మేరకు ధర్నా కార్యక్రమాలను చేపడుతున్నామని దీనికి నిరసనగా కోర్టు విధులను బహిష్కరించడం జరిగిందని ఆయన స్పష్టంచేశారు. సుమారు గంటకు పైగా రహదారులను దిగ్భందం చేశారు. ఈకార్యక్రమంలో న్యాయవాదులు రోణంకి కృష్ణంనాయుడు, గణేష్, ఆర్.కొండలరావు, లక్ష్మీ, సుమబాల, ధర్మాన వెంకటరమణ, బలగ అనంతరావు, రెడ్డిజగన్నాధం, జామి కామేశ్వరరావు, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.