శ్రీకాకుళం

14 జాతీయ లోక్ అదాలత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 23: ఏప్రిల్ 14న జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ చైర్మన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి వి.బి నిర్మలగీతాంబ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు .దీని ద్వారా వివిధ రకాల కేసులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో లిటిగెంట్ కేసులు, పెండింగ్ ఫ్రీ లిటిగెంట్ కేసులు ఈకార్యక్రమం ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. కోర్టు ఆవరణలో ఉదయం 10:30 నుండి ప్రారంభవౌతుందని ప్రజలు లోక్ అదాలత్‌లో తమ కేసులను పరిష్కరించుకుని లబ్ధిపొందాలని కోరారు.