శ్రీకాకుళం

పేదరిక నిర్మూలనకు ఉపాధి హామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 23: పేదరిక నిర్మూలనకు ఉపాధి హామీ పథకం దోహద పడుతుందని డుమా పీడి హెచ్.కూర్మారావు పేర్కొన్నారు. శుక్రవారం డుమా సంస్థ డి ఎల్ ఆర్ సి భవనానికి 14 దేశాల నుంచి అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమం కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డవలప్‌మెంట్ ద్వారా ఉపాధిహామీ పనులు అమలు తీరును అధ్యయనం చేసేందుకు విచ్చేశారు. డుమా సంస్థ ఉపాధిహామీ పథకం ద్వారా చేపడుతున్న వివిధ పథకాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీరికి అవగాహన కల్పించారు. ముందుగా డుమా ప్రాజెక్టు డైరెక్టర్ కూర్మారావుతో ఇంట్రాక్ట్ అయ్యారు. పవర్‌పాయింట్ ద్వారా భారత దేశంలో అమలౌతున్న వివిధ పథకాల గురించి పీడి వివరించారు. అందులో ప్రస్తుతం ఉపాధి కల్పన, ఉపాధిహామీ పథకం అమలులో కీలకపాత్రలు పోషిస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా నీటి లభ్యత ఏ విధంగా ఉన్నదీ, మన దేశంలో ఏ విధంగా ఉన్నదీ అని వివరించారు. అడుగంటుతున్న నీటి వనరుల వలన కొరత ఏర్పడుతున్నట్లు వివరించారు. ప్రస్తుత జనాభాకు అవసరమైన నీరు కావాలంటే ఏ యే చర్యలు చేపట్టాలి, నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి. సహజ వనరులైన నీరు, భూమి చెట్లను ఏ విధంగా సంరక్షించుకోవాలనే విషయాలను వివరించారు. ఉపాధి హామీ పథకం ప్రధానంగా రెండు లక్ష్యాల కోసం అమలౌతుందని తెలిపారు. 1 గ్రామీణ ప్రాంతాల్లో కూలీ పనిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు వంద రోజులు పని కల్పించడం ఈ పనుల ద్వారా గ్రామాల్లో సుస్ధిర ఆదాయాన్ని కల్పించడం, సహజ వనరుల యాజమాన్యానికి సంబంధించిన పనులను చేపట్టడం, అనగా చెట్లు నాటడం, చెక్‌డామ్స్ నిర్మించడం, నీటి నిల్వ కోసం చెరువులు, పంట కుంటలు నిర్మించడం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తుంది. తద్వారా గ్రామాల్లో వౌలిక వసతుల కల్పనకు కృషి జరుగుతుంది. దీని ద్వారా మానవులకు జీవన ప్రమాణాలు పెరిగి జీవితకాలం పెరుగుతుందని వివరించారు. దినం దినం అడుగంటుతున్న నీటి స్థాయిపై వివరిస్తూ అబ్దుల్ కలాం తయారు చేసిన ప్రాజెక్టును చూపించారు. ఇందులో ప్రస్తుత పరిస్థితిలో నీరు వ్యర్ధం చేయడం ద్వారా భవిష్యత్‌లో ఎటువంటి దుష్పరిణామాలు ఏర్పడతాయనేది వివరించారు. భవిష్యత్‌లో నీటి యుద్దాలు జరుగుతాయని, నీటి రక్షణకు వీధుల్లో తుపాకులతో కాపుకాయాల్సి వస్తుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో నీటిని సంరక్షించుకోవాల్సిన విషయాన్ని వివరించారు. నీటి వృధాను అరికట్టాలని, భూగర్భజలాల పెంపు పనులను చేపట్టాలని వివరించారు. ఇటువంటి చర్యలు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నట్లు తెలియజేశారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ జిల్లా ఉపాధి హామీలతో చేపడుతున్న పనుల గురించి వివరించారు. ఉపాధి హామీలో 40శాతం మెటీరియల్ పనులు, వివిద సంస్థల సమన్వయంతో చేపడుతున్నట్లు తెలిపారు. చెత్తనుండి సంపద తయారీ కేంద్రాలు, అంగన్వాడీ , పంచాయతీ భవనాలు, మండల స్థాయి స్ర్తిశక్త్భివనాలు, పాఠశాలలో క్రీడామైధానాలు, సీసీ రోడ్లు, చేపల ఫ్లాట్‌ఫారాల తదితర పనులను చేపడుతున్నట్లు తెలియజేశారు. పంచాయితీ రాజ్, ఐ టి డి ఏ , ఏపి ఎం ఐ పి, ఆర్ డబ్ల్యూ ఎస్, డి ఆర్ డి ఏ ,హార్టికల్చర్, షిషరీస్, అగ్రికల్చరల్ డిపార్ట్‌మెంట్‌లు సమన్వయంతో పనులను చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం బైరివాని పేట గ్రామాన్ని సందర్శించారు. డుమా సిబ్బంది, ఏపీడీలు పాల్గొన్నారు. వివిధ దేశాలనుండి విచ్చేసిన బృందాలు పాల్గొన్నారు. ఇథియోపియా నుండి ఎరైనా, డేరేజ్ మెంగిస్తే, అధినూసెగయే అష్ఫా, కిర్జస్థాన్ నుండి కలిచఅబ్దుల్లా, మార్‌టస్ నుండి రినాఫేస్తో, కెరోలిన్‌పొంటిసే, శ్రీలంక ఎం.అంజాలికా ఇందుమతి, జయరత్న లియానా అర్పిగే, మాలీప్రియాంక ఫెరిమునా, సిరియా నుండి వౌమెన్ సదిద్దీన్ అల్దీన్ తదితరులు హాజరయ్యారు. ఎన్ ఆర్‌డి బృందాలు జిడి కృష్ణ, లోహిదాస్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ ఐ ఆర్ డి రూపేస్తూల్, రీసెర్చ్ అధికారి అచ్యుతరావు, జెడ్పి డిప్యూటీ సి ఈవో లక్ష్మీపతి, డుమా ఏవో గోపాలరావు, ఎం ఓడి అప్పలనాయుడు, ఏపిడీలు రామారావు, రాధ, స్వరూపారాణి, శైలజ, కిశోర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.