శ్రీకాకుళం

బిఎస్‌ఎన్‌ఎల్ గుర్తింపు ఎన్నికల్లో... ఎన్‌ఎఫ్‌టిఇ చారిత్రాత్మక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), మే 12: బిఎస్‌ఎన్‌ఎల్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎన్‌ఎఫ్‌టిఇ చారిత్రాత్మక విజయం అందుకుంది. ఈనెల 10వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని ఆరు డివిజన్ల పరిధిలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 367 ఓట్లు పోలవగా గురువారం ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభించారు. ఇందులో ఎన్‌ఎఫ్‌టిఇ 180 ఓట్లు సాధించగా, ఇప్పటి వరకు ఆరు పర్యాయాలు గుర్తింపు సంఘంగా ఉన్న ఎంప్లారుూస్ యూనియన్‌కు 174 ఓట్లు వచ్చాయి. దీంతో ఆరు ఓట్ల తేడాతో ఎన్‌ఎఫ్‌టిఇ గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. ఇదిలా వుంటే బిఎస్‌ఎన్‌ఎల్ లో ఇతర యూనియన్లు ఎఫ్‌ఎన్‌టివోకు ఆరు ఓట్లు, ఇతరులకు ఏడు ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా ఎన్‌ఎఫ్‌టిఇ అధ్యక్ష, కార్యదర్శులు డి.వెంకటేశ్వరరావు, పి.నారన్నాయుడుల నేతృత్వంలో ఉద్యోగులు టపాస్‌లు పేల్చి సందడి చేశారు. చారిత్రాత్మక విజయం అందుకున్నందుకు వారి ఆనందానికి అంతే లేకుండా పోయింది. కాగా అధ్యక్ష, కార్యదర్శులు మీడియాతో మాట్లాడుతూ బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థగా ఏర్పడి 18 ఏళ్లకు ఎంప్లారుూస్ యూనియన్ దురాగతాలకు మంగళం పాడే రోజు వచ్చిందన్నారు. ఇది సమష్టి విజయమని, తాము ఇచ్చిన హామీలు తప్పక నెరవేరుస్తామని చెప్పారు. ఎంప్లారుూస్ యూనియన్ గుర్తింపులో ఉండగా సమాధి చేసిన బోనస్, ఎల్‌టిసి, మెడికల్ రీ యింబర్స్‌మెంట్ వంటి సదుపాయాలను అమలు చేయిస్తామన్నారు. అలాగే మెరుగైన వేతన సవరణ తెస్తామని, సంస్థ అభివృద్ధికి యాజమాన్యానికి తమవంతు సాయం అందిస్తామని చెప్పారు.

.