శ్రీకాకుళం

యువత రక్తదానానికి ముందుకు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, మే 12: రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులై ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు రక్తనిల్వలు ఎంతో అవసరమని జాయింట్ కలెక్టర్ -2 పి.రజనీకాంతారావు స్పష్టంచేశారు. రక్తనిల్వలు అవసరాలు తీర్చేందుకు వీలుగా యువత స్వచ్ఛందసంస్థలు, ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలకు వచ్చి రక్తాన్ని విరివిగా దానంచేయాలని ఆయన కోరారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఐటిఐ గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జెసి-2 ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తందానం చేయడం వలన అనారోగ్యానికి గురవుతున్న అపోహను వీడి యువత ముందుకు రావాలని సూచించారు. జిల్లాలో విశాల సముద్ర తీరం, జాతీయ రహదారి ఉండటం వలన నానాటికి రక్తం నిల్వల ఆవశ్యకత మరింత పెరుగుతూవస్తుందన్నారు. ఎంపిడివో పంచాది రాధ, ప్రిన్సిపల్ రాడ కైలాశరావులు సిబ్బంది, విశ్రాంతి సిఇవో సురంగి మోహనరావు, విద్యార్థులు ఉన్నారు. రెడ్‌క్రాస్ సంస్థ నేతృత్వంలో నిర్వహించిన ఈ శిబిరంలో 48మంది రక్తాన్ని దానం చేశారు. సంస్థ ప్రతినిధులు, వైద్యులు సేవలందించారు.