శ్రీకాకుళం

రిజిస్ట్రేషన్ లేని 40 వాహనాలు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, ఏప్రిల్ 17: కొత్తగా వాహనాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ లేకుండా తిప్పుతున్న 40 వాహనాలను పలాస మోటారువాహనాల ఇన్‌స్పెక్టర్ కె.ప్రకాశరావు సీజ్ చేసారు. సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి శ్రీకాకుళం ఆర్‌టివో ఆఫీసులో జరిమానా చెల్లించి రిలీవ్ ఆర్డర్ తెచ్చుకోవాలని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ లేని వాహనాలపై ఈ నెల 31వ తేది వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, అందువల్ల వాహనాల యజమానులు తమ వాహనాలకు తక్షణమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, లేనిచో వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
అత్యాచార సంఘటనలపై ప్రభుత్వాలు స్పందించాలి
పలాస, ఏప్రిల్ 17: మహిళలపై జరుగుతున్న అత్యాచార సంఘటనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి దోషులను శిక్షించాలనే డిమాండ్‌తో పలాస జనసేన కార్యకర్తలు కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. దీనిపై జనసేన నాయకులు బమ్మిడి సంతోష్ మాట్లాడుతూ దేశసరిహద్దు కాశ్మీర్‌లో చిన్నారి ఆసిఫాను అఘాయిత్యం చేసి చంపేసిన, యుపిలో మహిళలపై బిజెపీ నాయకుడు జరిపిన అఘాయిత్యానికి, విజయనగరంలో దివ్యాంగురాలిపై దాడి జరిపిన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలనే నినాదంతో దీక్షలకు పూనుకోవడం జరిగిందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంఘటనపై కనీసం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వాలు తక్షణమే స్పందించి దోషులకు శిక్షించాలని డిమాండ్ చేసారు. దీక్షలో ఆశశ్రీ, పూర్ణచంద్రరావు, నాని, పవన్, సాయి, నర్శింహా, ఈశ్వరరావు, యాదవ్‌లు పాల్గొనగా, వారికి చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, సిపిఐ(ఎంఎల్)లిబరేషన్ నాయకులు మద్దిల రామారావు మద్దతు తెలిపి, సంఘీభావం తెలిపారు.
రెవెన్యూశాఖ దౌర్జన్యం నశించాలి
పలాస, ఏప్రిల్ 17: జెసిబి, ట్రాక్టరు యజమానులపై రెవెన్యూశాఖ దౌర్జన్యాలనుల నశించాలని జెసిబి, ట్రాక్టరు యజమానులు తమ వాహానాలతో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ర్యాలీ నిర్వహించి, టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శివాజీకి వినతిపత్రం అందించారు. తమ జెసిబి, ట్రాక్టర్లుతో పొలం పనులు, చెరువు పనులు చేసుకొని జీవనోపాధి పొందుతున్నామని, పనులు చేస్తున్న సమయంలో రెవెన్యూ సిబ్బంది వచ్చి దౌర్జన్యంగా తమ వాహనాల తాళాలు తీసుకొని, తమపై దురుసుగా ప్రవర్తించి అవమానిస్తున్నారని, రెవెన్యూశాఖ ఆగడాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు జి.నిరంజన్, కృష్ణారావు, ఎం.వి.రావు, బి.కృష్ణారావు, బి.జోగారావు, బి.్భస్కరరావు, బాలకృష్ణ, గోపినాధ్ తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులు
పాలకొండ, ఏప్రిల్ 17: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2018-19 విద్యా సంవత్సరంలో వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పప్పల కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం బీ ఏ, బీ ఎస్సీ, ఎంపీసీ, సీబీజెడ్, బీకాం గ్రూప్‌ల్లో ప్రవేశానికి నమూనా దరఖాస్తులు కళాశాల పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లభిస్తాయని తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందిన, ఇనిస్టెంట్ పరీక్షకు వెళుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తులు పొంది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించారు.