శ్రీకాకుళం

పల్లపు ప్రాంతాల్లో తేలిక విత్తనాలు వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, ఏప్రిల్ 17:వంశదార నదీ తీరం పలు గ్రామాల్లో చిన్నపాటి వర్షంకు వరదనీరు చేరుతున్నందున ఈ ప్రాంతం రైతులు తేలికపాటి విత్తనాలు వేసుకోవాలని ఏవో విజయభాస్కర్ అన్నారు. సురవరం, డొంపాక గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన విలేజ్ యాక్షన్ ప్లాన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతం అధిక శాతం వర్షపునీటిలో తడుస్తూ రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనికి తగ్గవిత్తనాలు వినియోగించాలని, అవసరమైతే ఎద పంటకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతీ రైతు ఎరువులను వినియోగించడంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈసమావేశంలో వాన రాజు, ఉద్యానవన అధికారి ధర్మ, వ్యవసాయ శాఖ సిబ్బంది పలువురు రైతులు పాల్గొన్నారు.

పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం
* సంఘటన కార్యదర్శి భాజీరావుఖోడే
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 17 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జ్ భాజీరావుఖోడే అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం స్థానిక ఇందిర విజ్ఞాన్ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డోల జగన్ అద్యక్షతన జరిగిన సమావేశంలో దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ అమలుపరిచిన పంచాయతీరాజ్ అభివృద్ది పధకాలను తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి పేరిట పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూపచ్చచొక్కాలకు పట్టం కట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్ పీ టీ సీ లను ఉత్సవ విగ్రహాలుగా చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసారని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థను పఠిస్టపరచాలనే ఉద్దేశ్యంతో సంఘటన కార్యదర్శులను నియమించారని దీనిని మండల స్థాయి, గ్రామ స్థాయి లకు కూడా విస్తరించనున్నట్లు తెలియజేశారు. గతంలో పంచాయతీ రాజ్ వ్యవస్థలకు మంచి అధికారాలు ఉండేవని కేరళ రాష్ట్రంలో అది పఠిష్టంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రత్నాల నరసింహమూర్తి, నంబాల రాజశేఖర్, సనపల అన్నాజీరావు, బాన్న రాము, ఎమ్ ఏ బేగ్, డి ఎస్ కె ప్రసాద్, రెల్ల సురేష్, కడగల నాగరాజు, అల్లిబిల్లి రాధ, కొంక్యాన మురళీధర్, పైడి రవి, మామిడి రాంబాబు, కె రాజ్యలక్ష్మి, కె ఎల్ ఎన్ ఈశ్వరి, పైడి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకోవాలి
వజ్రపుకొత్తూరు, ఏప్రిల్ 17: చేపల వేట ప్రధానంగా సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అన్నారు. హుకుంపేటకు చెందిన మత్స్యకారుడు వంక సింహాచలంనకు చెందిన బోటు సముద్రంలో తీవ్ర అలల తాకిడికి ఇటీవల ధ్వంసమైంది. మంగళవారం బాధితుడికి రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల వేట నిషేదం సమయంలో మత్స్యకారులు అందరికీ ప్రభుత్వం అందిస్తున్న సహాయం చేరాలన్నారు. మత్స్యకారులు సముద్ర గాలులకు కంటిచూపుకోల్పోతున్నారని, 50 ఏళ్లకు పింఛను అందించి ఆదుకోవాలన్నారు. ఆయనతో పాటు కౌన్సిలర్లు ఎస్.మోహనరావు, కవిత వల్లభరావు, బళ్ల రేవతి శ్రీనివాసరావు, సంఘ అధ్యక్షుడు వంక మోహనరావు, కోదండ, నీలయ్య పాల్గొన్నారు.