శ్రీకాకుళం

రాజాంలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, ఏప్రిల్ 24: రాజాం ప్రాంతంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు భారీ వర్షం కురవడంతో ప్రజాజీవితం అతలాకుతలమైంది. ఇదే సమయంలో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు వల్ల గడిముడిదాం, కొత్తవలస గ్రామాల్లో పిడుగులు పడ్డాయి. కొత్తవలసలో బట్న పోలినాయుడుకు చెందిన పాడి ఆవు మృతి చెందగా, గడిముడిదాంలో కూర్మినాయుడుకు చెందిన పాడి గేదె పిడుగుపాటుకు మృతి చెందింది. పశువైద్యులు సుమన్, వీ ఆర్వో రమణమూర్తి తదితరులు చనిపోయిన పశువులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. ఇదిలావుండగా రాజాం రోడ్లు విస్తరణకు సంబంధించి భవనాలు తొలగించినప్పుడు పూడుకుపోయిన మురుగుకాలువలు వల్ల మురుగునీరంతా సుమరు కిలోమీటరు మేర ప్రవహించి పలు ఇబ్బందులకు గురిచేసింది. ఇంత జరిగినా నగర పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో ప్రజల నుంచి విమర్శలు అందాయి. ఈ వర్షం రైతులకు ఎంతో మేలు చేస్తుందని, రానున్న ఖరీఫ్‌కు సంబంధించి దుక్కులు చేసుకొని పంటలకు సమాయత్తమవుతున్నామని రైతులు అంటున్నారు.
గోపాలపురంలో ఖరీఫ్ సదస్సు
రాజాం, ఏప్రిల్ 24: రాజాం నగర పంచాయతీ ఖరీఫ్ సదస్సు వ్యవసాయాధికారి అప్పారావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. హాజరైన రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో మెట్ట సేద్యం కింద మొక్కజొన్న, వేరుశెనగ, ఇతర పంటలు వేసుకోవాలని, అలాగే సేంద్రీయ ఎరువులు, విత్తనాలు సిద్దంగా ఉన్నాయని, వాటిని కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జగన్నాథం, జాడ ప్రసాదరావు, రైతులు పాల్గొన్నారు.