శ్రీకాకుళం

సనాతన విలువలతో విద్యాబోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, ఏప్రిల్ 24:సత్యసాయి బోధనతో సనాతన ధర్మంతో కూడిన విద్యాబోధన చేయాలని ప్రముఖ వైద్యులు మల్లేశ్వరరావు అన్నారు. మంగళవారం రామకృష్ణాపురంలో సత్యసాయి విద్యావిహార్‌లో 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి దివ్య ఆశీస్సులతో ప్రశాంత వాతావరణంలో ఏర్పడిన ఈ పాఠశాల విద్యార్థులకు సనాతన విలువలతో కూడిన విద్యను అందించాలని ఆకాంక్షించారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు మార్కులు ప్రామాణికంగా చూస్తున్నారు తప్పితే వారిలో వున్న విలువలను గుర్తించడం లేదన్నారు. సమాజంలో విలువలు అంతరించిపోవడానికి విద్యార్థుల తల్లిదండ్రుల పోటీ అని, అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో సనాతన విలువలతో కూడిన విద్యను అందించడం సత్యసాయి ఎడ్యుకేషనల్ అండ్ సోసైటీని అభినందించాల్సిందేనన్నారు. అనంతరం బాలబాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సత్యసాయి విద్యావిహార్ చైర్మన్ బాలకృష్ణ, సత్యసాయి ఎడ్యుకేషన్ సోసైటీ అధ్యక్షుడు మాల్లా రామేశ్వరరావు, ఉస్మానియా యూనివర్శిటీ ప్రోఫెసర్ దేశాయ్‌పాండే, పలాస ఆర్టీసీ డిపో మేనేజరు పెంట శివప్రసాద్, రిటైర్డు ఎం ఇవో సత్యనారాయణ, జామి రామారావు, మల్లా కాంతారావు, పివి సతీష్, ప్రిన్సిపాల్ జ్యోతి ఎల్లార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

పలాసలో వైసీపీకి తిరుగులేదు
పలాస, ఏప్రిల్ 24: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి పలాస నియోజకవర్గంలో తిరుగులేదని వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నట్లు పలాస వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. మంగళవారం జగన్ చేపడుతున్న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గన్నవరంకు చేరుకున్న తరుణంలో అప్పలరాజు ఆధ్వర్యంలో మాజీ జడ్‌పిటిసి వరిశ హరిప్రసాద్, మాజీ జిల్లా తెలుగుదేశం పట్టణ కార్యదర్శి బడగల బల్లయ్య వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. హరిప్రసాద్‌ను, బల్లయ్యను వైసీపీ అధినేత వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు వై ఎస్ జగన్‌కు పలు విషయాలను వెల్లడించారు. పలాసలో హరిప్రసాద్‌కు, బల్లయ్యకు కార్యకర్తల బలం ఉందని, అటువంటి నేతలు వైసీపీలో చేరడం మంచి పరిణామమని, రానున్న ఎన్నికలలో విజయం సాధనకు శుభసూచికమన్నారు. దీనిపై జగన్ సానుకూలంగా స్పందిస్తూ ప్రతిపక్షనేతగా పలాసలో మీరు చేస్తున్న పోరాటం తెలుసుకుంటున్నామని, ఇదే స్పూర్తితో ముందుకు సాగి ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రధానంగా పార్టీ బలోపేతానికి దృష్టి సారించాలని, అధికార పార్టీ లోపాలను గుర్తించి ఎండగట్టాలని సూచించారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి పలాసలో ఎంతో మంది అభిమానులు వున్నారని, ఆ నాయకుడు ఆశీస్సులతో పలాసలో విజయం తథ్యమని భరోసా ఇచ్చారు. వారితోపాటు వైసీపీ నాయకులు పాలిన శ్రీనివాసరావు, ఎం.్భస్కరరావు, త్రినాధ్, బాడ జగన్నాయకులు, కె.గోపాల్, దువ్వాడ మధుకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.