శ్రీకాకుళం

మలేరియా అంతానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 24: మలేరియా అంతానికి మేము సిద్ధం అనే నినాదంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మలేరియాను అంతం చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సనపల తిరుపతిరావు స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మలేరియా వ్యాధి ఫాల్సీ ఫారం అనే పరాన్న జీవి వలన వస్తుందని అన్నారు. ఇది ఆడ అనాఫలిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలియజేశారు. వ్యాధి నిర్ధారణ కోసం క్షేత్ర సిబ్బంది రక్త నమూనాలను సేకరించి స్ధానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నారని రేపిడ్ డయోగ్నోస్టిక్ కిట్ (ఆర్‌డీటీ) ద్వారా నిర్ధారించవచ్చునని తెలియజేశారు. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత చికిత్స ఉందని నిర్మూలన చికిత్స కోసం పి.వి.14 రోజలు పి. ఎఫ్.టి 3 రోజులు చికిత్స ఇంటివద్దే ఇవ్వబడునని తెలియజేశారు. వ్యాధి ఇతరులకు ప్రభలకుండా వ్యాధి నమోదు అయిన గ్రామాల్లో ఎఎల్‌వో మరియు ఐఆర్‌ఎస్ ద్వారా దోమల నియంత్రణకు చర్యలు తీసుకోబడునని తెలియజేశారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మలేరియా వ్యాధిని నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించారన్నారు. ఇక మీదట ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా మలేరియా కేసులు నమోదు అయితే తక్షణమే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారికి తెలియజేయాలన్నారు. తద్వారా వ్యాధి ప్రభలకుండా జిల్లా యంత్రాంగం నివారణాచర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. 589 గ్రామాలను మలేరియా హైరిస్క్ గ్రామాలుగా గుర్తించామని, మొదటి విడత పిచికారీ కార్యక్రమం మే 15 నుండి జూన్ 30 వ తేదీ లోగా పూర్తిచేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న 75 ఆశ్రమ వసతి గృహాలలో జూలై 2018 లోగా పూర్తి చేస్తామన్నారు. రెండో విడత పిచికారి కార్యక్రమం ఆగస్టు 16వ తేదీ నుండి సెప్టెంబర్ 30 వ తేదీలోగా పూర్తి చేస్తామన్నారు. వర్షాకాలంలో మలేరియా, సీజనల్ వ్యాధులు రాకుండా హైరిస్క్ గ్రామాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహించబడునని తెలియజేశారు. ఈ సమావేశంలో కో- ఆర్డినేటర్ మెండ ప్రవీణ్, డీ ఎంవో జి.వీర్రాజు, డీ ఎల్‌వో కామేశ్వరప్రసాద్, పీవోడీటి కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు.

రక్తదానం మరొకరికి ప్రాణదానం
* జాయింట్ కలెక్టర్ చక్రదరబాబు
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 24: రక్తదానం మరొకరికి ప్రాణదానం వంటిందని జాయింట్ కలెక్టర్ కెవిఎన్ చక్రదరబాబు అన్నారు. ఆంధ్రా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్ధ శ్రీకాకుళం ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సౌజన్యంతో మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని జె.సి ప్రారంభిస్తు మాట్లాడారు. బ్లడ్ బ్యాంక్‌లో రక్త నిల్వలు నిండుకున్నాయని గ్రామీణ యువకులు, స్వచ్ఛంద సంస్ధలు ముందుకు వచ్చి రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడాలని కోరారు. ఆంధ్ర బ్యాంక్ డీజీఎం కె.రాజేంద్రకుమార్ మాట్లాడుతూ ఆంధ్రా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్ధ ద్వారా శిక్షణ పొందుతున్న యువతీ,యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నందుకు బ్యాంక్ తరపున ఆయన అభినందనలు తెలిపారు. సంస్ధ డైరక్టర్ కె.శ్రీనివాసఫణి మాట్లాడుతూ కార్ డ్రైవింగ్ మరియు పిఎంఈజీపిలో శిక్షణ పొందుతున్న యువతీ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ ఎజీఎం కె.వెంకటేష్, ఎల్‌డీఎం పి.వెంకటేశ్వరరావు, రెడ్‌క్రాస్ సంస్ధ చైర్మన్ జగన్మోహనరావు, పెంకి చైతన్యకుమార్, సిబ్బంది బి.ప్రసాదరావు, కె.హేమకుమార్, ఎం.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.