శ్రీకాకుళం

డంపింగ్ యార్డుకు స్థల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలాకి, ఏప్రిల్ 24 : మండలంలోగల తలసముద్రం గ్రామపంచాయతీలో స్థానిక పశువైద్య కేంద్రం వద్దప్రభుత్వ స్థలంలో డంపింగ్‌యార్డు నిర్మించడానికి స్థల పరిశీలన చేసినట్లు మండల తహసీల్దార్ ఎన్ని రామారావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన గ్రామస్థులతో మాట్లాడుతూ గ్రామంలో ఉన్న చెత్తను ఒక దగ్గరకు చేర్చినట్లయితే వాటిద్వారా కంపోస్ట్ ఎరువు తాయారవుతుందని, వాటిద్వారా గ్రామ పంచాయతీకి తాదాయం వస్తుందని, వాటివలన గ్రామాభివృద్ది చేసుకోవచ్చని ఆయన అన్నారు. అలాగే గ్రామంలో పారిశుద్యం బాగుపడుతుందని ఆయన అన్నారు. నిర్మాణపనులను ప్రారంభించాలని మండల పంచాయతీ శాఖకు, గ్రామపంచాయతీ సర్పంచ్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో వీ ఆర్ వో జగన్నాధరావు, పంచాయతీ సెక్రటరీ ఫల్గుణరావు,, స్థానిక సర్పంచ్ యాగాటి శ్రీరాములు, ఉప సర్పంచ్ సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ నిరసనకు ప్రజల నీరాజనాలు
నరసన్నపేట, ఏప్రిల్ 24 : రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వం తీరుపై గత మూడురోజులుగా ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు పిలుపుమేరకు చేపడుతున్న సైకిల్ యాత్రలకు ప్రజలనుండి నీరాజనాలు కనిపిస్తున్నాయి. మంగళవారం మండలంలోని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి ఆధ్వర్యంలోకరగాం,కంబసాయ పంచాయతీలో నిర్వహించిన సైకిల్ యాత్రలో ఎమ్మెల్యేకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యేకు స్వాగతం పలకడమే కాకుండా నుదుటిన తిలకం దిద్ది హారతులను అందజేసారు. కంబసాయ సర్పంచ్ పి. ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో స్వాగత కార్యక్రమాలను చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రాన్ని తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. మిత్రులుగా గత నాలుగేళ్ళుగా కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పరచుకొన్నప్పటికీ చివరి కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక హోదాపై ప్రస్తావించకపోవటంతోపాటు మొండి చేయి చూపించిందని విమర్శించారు. ప్రజలనుండి తేదేపా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోతేదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.

బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడిగా చింటు రామారావు
నరసన్నపేట, ఏప్రిల్ 24 : మండల కేంద్రంలోని స్థానిక మేజర్ పంచాయతీలో కొనసాగుతున్న నరసన్నపేట బిల్డింగ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా చింటు రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జిల్లా సొసైటీల రిజిస్ట్రార్ రమణమూర్తితెలిపారు. మంగళవారం స్థానిక డీసీసీబీ కార్యాలం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సి.అర్జున్ కొనసాగుతున్నారని, ఇటీవలకాలంలో ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో బోర్డు సభ్యుల తీర్మానంతో అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టారని తెలిపారు. ఈ దిశగా నిర్వహించిన పంచాయతీ సభ్యుల ఎన్నికలను ఏకగ్రీవంగా చింటు రామారావును ఎన్నుకోవడం జరిగిందని స్పష్టం చేసారు. ఈమేరకు నేటినుండి పదవీ బాధ్యతలు ఆయనకు అప్పజెప్పడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి జానకీరాం, సభ్యులు సదాశివుని కృష్ణ, పి నీలం, విజయ్‌కుమార్, శాంతారావు తదితరులు పాల్గొన్నారు.
‘‘మన ఊరు - మా బడి’’ కార్యక్రమం విజయవంతం
నరసన్నపేట, ఏప్రిల్ 24 : రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య పెంచేందుకుగాను నిర్వహిస్తున్న ‘‘మన ఊరు - మాబడి’’ కార్యక్రమం విజయవంతగా కొనసాగుతుందని మాకివలస ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత తెలిపారు. మంగళవారం గోపాలపెంట, పోతయ్యవలస, మాకివలస గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో వౌళిక సదుపాయాలతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత భోజన సదుపాయం, యూనిఫాంలు, పుస్తకాలు అందజేస్తున్నామని, అంతేకాకుండా ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఉపాధ్యాయులుతో బోధనా తరగతులను చేపడతున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రైవేటు పాఠశాలలకు మద్దతు తెలపవద్దని, ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని ఆమె స్పష్టం చేసారు. ప్రతి ఇంటింటీకి వెల్లి విద్యార్దుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని ఆమె స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చౌదరి నాయుడు, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు

ముందస్తు వ్యవసాయానికి శ్రీకారం
* వ్యవసాయ శాఖ ఏ డీ సత్యవతి
నరసన్నపేట, ఏప్రిల్ 24: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది ఖరీఫ్‌లో ముందస్తు వ్యవసాయానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని వ్యవసాయశాఖ ఏడీ డీ. సత్యవతి తెలిపారు. మంగళవారం మండలంలోని సత్యవరం గ్రామంలో వ్యవసాయా కార్యాచరణ ప్రణాళిక అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ ఏడాది ఆగష్ట్, సెప్టెంబర్ నెలల్లో వ్యవసాయాన్ని చేపట్టడం జరిగేదని, ఈ ఏడాది జూన్ నెలనుండి వ్యవసాయపనులు చేపట్టేదిశగా చర్యలు తీసుకుంటున్నామాని ఆమె వివరించారు. దీని వలన అక్టోబర్, నవంబర్ నెలలో వచ్చే తుఫాన్ తాకిడినుండి తప్పించుకోవడం జరుగుతుందని తద్వారా మెరుగైన దిగుబడులు సాధించుకొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి వరి విత్తనాలు, ఎరువులు సకాలంలో అందే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి వి.శ్రీనివాసరావు, మాజీ ఏ ఎం సీ అధ్యక్షులు ఆరంగి మురళీధర్, నర్సునాయుడు,రైతులు పాల్గొన్నారు.

విభజన హామీలు అమలు చేయాలి
* ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 24: విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంలో ఘోర వైఫల్యం చెందిందని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం నగరంలో సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీ స్ధానిక 7రోడ్ల కూడలి నుండి ప్రారంభమై చేపల మార్కెట్, కాకి వీధి, ముత్యాలమ్మ గుడి మీదుగా పాతబస్టాండ్‌కు చేరుకొని అరసవల్లి వైపు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌ను విభజించిన తర్వాత రాష్ట్రం ఆర్ధికంగా వెనుకబడిపోయింది అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో సీ ఎం చంద్రబాబునాయుడు బీజేపీ తో కలిసి పనిచేసిన సందర్భంలో ఏ రాజకీయ పార్టీ తప్పు పట్టాల్సిన అవసరం లేదని అన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ ఘోరంగా తప్పిదం చేయడం వలనే ప్రస్తుత పరిస్ధితి ఏర్పడిందని ప్రజల్లో చైతన్యం చేయుటకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాలు ఆర్ధిక వనరులు పొందడం రాజ్యాంగ హక్కు అనే విషయం కేంద్ర ప్రభుత్వాలు గుర్తెరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, టీడీపీ నగర అధ్యక్షుడు, మాదారపు వెంకటేష్, పాండ్రంకి శంకర్, కేశవ రాంబాబు, దూడ సుధాకర్, కొమర కమల, బుర్రా ప్రసాద్, అబ్దుల్ షాజహాన్, సిగిరెడ్డి నాగు, మైలపల్లి రాజు, కిరణ్, రఘు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.